Moong Dal: పెసలు తింటే.. ఇన్ని ప్రయోజనాలా..?
Moong Dal: శనగలు, కందులు అరుగుదల కొంచెం చాలా కష్టం. కానీ పెసలు అలా ఉండవు. తక్కువ సమయంలో జీర్ణం అవుతాయి. మన తెలుగువారికి ఇష్టమైన టిఫిన్లలో పెసరట్టు ముందు వరుసలో ఉంటుంది. మిక్సీ పట్టి అట్లు వేయడం చాలా ఈజీ. ఇది చాలా బాగుంటుంది. నానబెట్టి మొలకలు వచ్చాక వీటిని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. పెసలు ఎంతో మంచివి. ఎందుకంటే వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, కాల్షియం, సోడియం అన్ని సమృద్ధిగా ఉంటాయి.
Health Benefits of Sprouted Green Grams
పెసలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, విటమిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం నానబెట్టిన పెసలు బ్రేక్ ఫాస్ట్ గా తిన్నట్లయితే బరువు సులభంగా తగ్గుతారు. కండరాలకు బలాన్ని ఇస్తాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఉదయం నానబెట్టిన పచ్చి పెసలు తింటే చాలా యాక్టివ్ గా తయారవుతారు. శరీరంలో నీరసం తొలగిపోతుంది. ఇది ఎముకలకు బలాన్ని ఇస్తాయి.
నానబెట్టిన పెసలు తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లతో పాటు విటమిన్లు అధికంగా అందుతాయి. ఈ రెండు శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. నానబెట్టిన పెసలు తినడం వల్ల జుట్టు రాలడం, చర్మ సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శరీరంలో రక్తహీనత సమస్యలు కూడా మాయమవుతాయి. కొలెస్ట్రాల్ స్థాయి క్రమబద్ధంగా ఉండడానికి తోడ్పడతాయి. గుండె జబ్బులు దరి చేరవు. మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది.