Star Fruit: స్టార్ ఫ్రూట్ తో బోలెడు లాభాలు..కొత్తగా పెళ్లైన వారు పక్కాగా తినాల్సిందే ?
Star Fruit: మార్కెట్లో అనేక రకాల పనులు దొరుకుతూ ఉంటాయి. అందులో స్టార్ ఫ్రూట్ ఒకటి. ఈ ఫ్రూట్ చాలామందికి ఇష్టం. స్టార్ ఫ్రూట్ లో పండిన పండ్లు పసుపు రంగులోకి మారి చాలా రుచిగా ఉంటాయి. పండని పండ్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇవి కాస్త పులుపుగా ఉంటాయి. వీటి ఆకృతిని బట్టి స్టార్ ఫ్రూట్ అని పిలుస్తూ ఉంటారు. కానీ వీటి అసలు పేరు కారంబోలా. వీటిని ఎక్కువగా ఉష్ణ మండల దేశాలలో పండిస్తూ ఉంటారు.

Health benefits of Star fruit
ఆగ్నేయ ఆసియా, దక్షిణ పసిఫిక్, తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండును పండిస్తూ ఉంటారు. ఈ స్టార్ ఫ్రూట్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. స్టార్ ఫ్రూట్ లో విటమిన్లు, పోషకాలు, ఫైబర్, కాల్షియం, సోడియం, పోలేట్, కాపర్ అధికంగా ఉంటాయి. ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు తియ్యగా ఉన్నప్పటికీ పోషకాలు అధికంగా ఉంటాయి. స్టార్ ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది.
KCR: తెలంగాణలో 10 ఉపఎన్నికలు రానున్నాయి ?
ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. ఈ పండు తిన్నట్లయితే కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఆకలి అనిపించదు. ఆహారం తక్కువగా తీసుకుంటారు. దానివల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు చాలా మేలును చేస్తుంది. గ్యాస్, ఆసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. గుండెపోటు నివారించడంలో ఎంతగానో సహాయం చేస్తుంది.