Tippatiga: ఆయుర్వేద వైద్యంలో తిప్పతీగ ప్రాముఖ్యత.. పసుపు కలిపితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు!!


Health Benefits of Tippatiga and Turmeric

Tippatiga: ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక ఆయుర్వేద మూలికల్లో తిప్పతీగ (Tippatiga) ఒకటి. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా కనిపించే తీగ జాతి మొక్క. తిప్పతీగ ఆకుల నుంచి తీసిన రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Health Benefits of Tippatiga and Turmeric

రోగనిరోధక శక్తి పెంచేందుకు తిప్పతీగ రసంలో పసుపు, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇది శరీరంలోని ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. గృహ చికిత్సలో ఇది బలమైన ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తారు.

కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు తిప్పతీగ మిశ్రమాన్ని తాగితే మంచి ఫలితాలు పొందగలరు. ఈ మిశ్రమంలోని యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గించడంలో ఉపయోగ పడతాయి. అలాగే ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.

జీర్ణ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ మిశ్రమాన్ని సేవిస్తే గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

డయాబెటిస్ నియంత్రణ కోసం తిప్పతీగలోని ప్రత్యేక గుణాలు షుగర్ లెవెల్స్ తగ్గించడంలో సహాయపడతాయి. తిప్పతీగ, పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉండటంతో చర్మ సమస్యలు తగ్గుతాయి. మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఒకవేళ మీరు ఇతర మందులు వాడుతున్నట్లయితే, తిప్పతీగ మిశ్రమాన్ని వినియోగించే ముందు ఆయుర్వేద నిపుణులను సంప్రదించడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *