Tulsi Leaves: మన భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ తులసి మొక్కని దైవంతో సమానంగా కొలుస్తారు తులసి మొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఇంట్లో ఉండే వంటిల్లే వైద్యశాల అని అంటారు మనకు తెలియకుండానే మన ఇంట్లో చాలా మూలికలు ఉంటాయి. ఇవన్నీ మన ఒంట్లో సమస్యల్ని తొందరగా దూరం చేస్తాయి అలాంటి వాటిలో ఒకటి తులసి. తులసికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. తులసిని వాడడం వల్ల చాలా సమస్యలు తొందరగా దూరమవుతాయి. తులసి చెట్టు కేవలం పూజ ఆచారాలకు మాత్రమే కాకుండా ఇందులోని ఔషధ గుణాలు ఎన్నో సమస్యలకు ఔషధంగా వాడతారు. దీనికి సరైన విధంగా తీసుకుంటే ప్రకృతిలోనే ఆరోగ్యంతో పాటు జుట్టుకి, చర్మానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఏ ఏ సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు చూద్దాం.
Health Benefits Of Tulsi Leaves
తులసి నీటిని తాగితే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా ఇది మంచిది. రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల చర్మ సమస్యలు ఎదురవుతాయి. దీంతో మొటిమలు పెరుగుతాయి. ఇలా కాకుండా చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా చేయడానికి తులసిలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బాగా హెల్ప్ చేస్తాయి. మచ్చలు, మొటిమలు, తొందరగా తగ్గుతాయి. దీనివల్ల తల దురద జుట్టు రాల డాన్ని తొందరగా తగ్గిస్తుంది. అలాగే చుండ్రు సమస్యను కూడా దూరం అవుతుంది. తులసి వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడేందుకు తులసిని చాలా రకాలుగా వాడతారు.తులసి ఆకులలో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తులసిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో చాలా సమస్యలు తొందరగా దూరం అవుతాయి. చర్మ సమస్యలకి తులసి చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తులసిలోని హార్మోన్ ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది. తులసి నీటిని తాగడం వల్ల గొంతు నొప్పి వంటి సమస్యలు తొందరగా దూరమవుతాయి. దీంతోపాటు మన బద్ధకం కూడా తగ్గుతుంది. డయాబెటిస్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. దీనిని తీసుకోవడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే తులసిని తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన పోగొట్టేందుకు మంచిది.దీనిని వాడడం వల్ల అలర్జీలు, జలుబు, మైగ్రేన్ తలనొప్పి తొందరగా తగ్గుతుంది.
Also Read: Ram Charan Game Changer: గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ ప్లాన్స్ మాములుగా లేదు.. దిల్ మామ అదరగొట్టాడు గా!!
5 తాజా తులసి ఆకులను తీసుకోండి. ఇది సాయంత్రానికి ముందే తీసుకోండి. సాయంత్రం సమయంలో తులసిని ముట్టుకోకూడదని పెద్దలు అంటారు. దీని వెనక సైన్స్ కూడా ఉంది. సాయంత్రం సమయంలో తులసి గుణాలు తగ్గుతాయి. తులసి ఆకులని బాగా కడిగి రెండు గ్లాసుల నీటిలో వేయండి రాత్రంతా మూత పెట్టి ఉంచండి. రోజు ఆ నీటిని సగం అయ్యేవరకు మరిగించండి దానిని ఖాళీ కడుపుతో గోరువెచ్చగా తాగండి. ప్రతిరోజు ఉదయం తులసి ఆకులను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన, జలుబు, జీర్ణ క్రియ ఉదర సంబంధిత సమస్యలు తొందరగా దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.