Ajwain: వాముతో ఆరోగ్య ప్రయోజనాలు..చలికాలంలో తింటే ?
Ajwain: వాము తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాములో పొటాషియం, పాస్పరస్, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వామును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగినట్లయితే శరీరంలో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. గుండె జబ్బులను దూరం చేస్తుంది. రక్త పోటును తగ్గించడంలో వాము కీలకపాత్రను పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Ajwain
Health BeneFits With Ajwain
రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడకుండా చేస్తుంది. జలుబు, దగ్గు లాంటి సీజనల్ వ్యాధులను అరికట్టడానికి వాము ముఖ్యపాత్ర పోషిస్తుంది. గోరువెచ్చని నీటిలో వాము వేసుకొని తాగినట్లయితే మంచి లాభాలు ఉంటాయి. వాములో యాంటీ మైక్రో బయల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పీరియడ్స్ సమయంలో మహిళలకు కడుపునొప్పి, తిమ్మిర్లు, కాళ్ల వాపులు వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో వాము నీటిని తీసుకోవడం మంచిది. Ajwain
Also Read: Yuvraj: పెన్షన్ డబ్బులతో బతుకుతున్న టీమిండియా ప్లేయర్ ?
ఇది మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. పంటి సమస్యలను సైతం తగ్గించడంలో వాము ఎంతగానో సహాయం చేస్తుంది. వాముని పొడి చేసుకొని తినడం వల్ల నోటి సమస్యలు తొలగిపోతాయి. దుర్వాసన రాకుండా ఉంటుంది. అందాన్ని కాపాడడంలో కూడా వాము ఉపయోగపడుతుంది. వాము పొడిలో కొద్దిగా నీరు కలుపుకుని పేస్టులా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే మచ్చలు, మొటిమలు దూరమవుతాయి. ఇలా ముఖానికి వారానికి ఒకసారి పేస్ట్ చేసుకుని అప్లై చేసుకున్నట్లయితే ముడతలు సైతం తొలగిపోయి యవ్వనంగా తయారవుతారు. Ajwain