Ber fruit: చలికాలంలో రేగు పండ్ల సీజన్ ప్రారంభమవుతుంది చాలా మంది రేగు పండ్లు తినడానికి ఇష్టపడతారు. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. రేగు పండులో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం అధికంగా ఉంటాయి. శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడడానికి ఇవి ఎంతగానో పనిచేస్తాయి. రేగు పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. Ber fruit

Health Benefits With Ber fruit

ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయం చేస్తుంది. రేగు పండు రక్తహీనత సమస్యలను తగ్గించి రక్త ప్రసరణ సాఫీగా జరిగేటట్టు చేస్తుంది. ఎండిన రేగుపండ్లలో కాల్షియం, ఫాస్పరస్ అధికంగా లభిస్తాయి. ఇవి ఎముకలు దృఢంగా ఉండడానికి చాలా సహాయం చేస్తాయి. రేగుపండ్లలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. Ber fruit

Also Read: KTR: BRSకు బిగ్‌ షాక్‌…కాంగ్రెస్‌ పార్టీలోకి కేటీఆర్‌ సన్నిహితులు ?

ముఖ్యంగా నోటి, బెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుంది. ఇందులో విటమిన్ కే ఉంటుంది. ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడే వారికి రేగుపండు ఎంతో మేలును చేస్తాయి. కీళ్ళకి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. రేగు పండ్లు ఒత్తిడి తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తాయి. దీనిలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. రేగుపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం ఉన్నవారికి చాలా మంచిది. చాలా వరకు తగ్గిపోతుంది. Ber fruit