Buttermilk: మజ్జిగ తాగడానికి సరైన సమయం ఎప్పుడో తెలుసా?
Buttermilk: మజ్జిగలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కాల్షియం, పొటాషియం, ప్రోటీన్ ఇందులో అధికంగా ఉంటాయి. అలాగే మైక్రోబియల్ గుణాలు, లాక్టిక్ యాసిడ్ కూడా అధికంగా ఉంటాయి. మజ్జిగను తాగడం వల్ల ఏసిడిటీ సమస్య నుంచి బయటపడవచ్చు. మజ్జిగను తినేటప్పుడు కొంచెం మిరియాలు, అల్లం లేదా సొంటి వేసుకొని తిన్నట్లయితే ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కూడా మజ్జిగ ఎంతగానో ఉపయోగపడుతుంది.
health benefits with Buttermilk
మజ్జిగను తాగినట్లయితే శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పేగులకు కావాల్సిన పోషకాలను మజ్జిగ అందిస్తుంది. దీనిని తాగడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. తద్వారా మలబద్ధకం సమస్యలు తొలగిపోతాయి. పెద్ద పేగులలో ఇబ్బందులను తొలగించడానికి మజ్జిగ ఎంతగానో ఉపయోగపడుతుంది. మజ్జిగను తీసుకున్నట్లయితే గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది.
ఇది ఎముకలను బలంగా తయారు చేస్తాయి. ఆసియో పారోసిస్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. మజ్జిగను తీసుకోవడం వల్ల విటమిన్ బి12 అధికంగా అందుతుంది. శరీరానికి ఎనర్జీ వస్తుంది. రోజంతా ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారు. మజ్జికలో నీటి శాతం ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా మారుస్తాయి. తద్వారా చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ప్రతిరోజు ఒక గ్లాస్ మజ్జిగ తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.