Carrot Halwa: క్యారెట్ హల్వా తింటున్నారా.. అయితే ఒక్కసారి ఆలోచించండి ?
Carrot Halwa: క్యారెట్ చూడడానికి రంగు చాలా బాగుంటుంది. క్యారెట్ చూడగానే ఆకర్షిస్తుంది. ఇది తింటే కంటి చూపు మెరుగు పడుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. నిజానికి క్యారెట్ తిన్నట్లయితే కంటి చూపు మాత్రమే కాకుండా ఇంకెన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో పీచు, పొటాషియం, కెలోరీలు, ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కాల్షియం, విటమిన్లతో నిండి ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధకంగా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. రక్తపోటు, గుండె జబ్బులను నియంత్రిస్తాయి. క్యారెట్ తిన్నట్లయితే జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. Carrot Halwa
Health BeneFits With Carrot Halwa
క్యారెట్ తినే వారిలో ఎముకలు పటిష్టంగా ఉంటాయి. ఊబకాయం సమస్యలు తొలగిపోతాయి. క్యారెట్ తినడం వల్ల నోటికి చాలా మంచిది. క్యారెట్ పచ్చిగానే కాకుండా రకరకాల వంటకాలలోనూ వాడుకోవచ్చు. ముఖ్యంగా క్యారెట్ తో చేసిన హల్వా చాలా బాగుంటుంది. చలికాలంలో చాలా ఇళ్లలో క్యారెట్ హల్వా ఎక్కువగా తింటారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ క్యారెట్ హల్వాను ఇష్టంగా తింటారు. అయితే చలికాలంలో క్యారెట్ హల్వా తిన్నట్లయితే ప్రమాదం కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ హల్వాను ఎక్కువ చక్కెర, నెయ్యితో తయారు చేస్తారు. Carrot Halwa
Also Read: Hot Water Bath: వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా.. ఈ జబ్బు రావడం ఖాయం ?
అంటే తీపి చాలా ఎక్కువగా ఉంటుంది. మధుమేహ రోగులు దీనిని తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. దానివల్ల లేనిపోని వ్యాధులు వస్తాయి. అలాగే ఊబకాయంతో బాధపడేవారు క్యారెట్ హల్వాకు దూరంగా ఉండాలి. బరువు తగ్గాలనుకునే వారు, డైట్ లో ఉన్నవారు కూడా క్యారెట్ హల్వా తినకూడదు. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. ఇందులో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి. దీనిని తినడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్ణం సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు క్యారెట్ హల్వా తినక పోవడమే మంచిది. Carrot Halwa