Carrots: తియ్యగా ఉందని క్యారెట్ తింటున్నారా.. అయితే డేంజరే ?

Carrots: వయసు పెరుగుతున్న కొద్ది అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్యంతో పాటు అందం పోషణలోనూ చాలామంది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. అలాంటి వారు క్యారెట్ తినడం వల్ల చాలా మంచిది. ఇందులో ఎ, కె, b6 బయోటిక్ మినరల్స్, బీటా కెరోటిన్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. క్యారెట్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. Carrots

Health Benefits With Carrots

క్యారెట్ నేరుగా కానీ ఉడికించి కానీ తీసుకున్న ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిది. కడుపునొప్పి ఉన్నవారు క్యారెట్స్ తినకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి ఇది చాలా అవసరం. క్యారెట్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. Carrots

Also Read: Kohli – Gambhir: గంభీర్ – కోహ్లీ సెలబ్రేషన్స్.. ఫ్యాన్స్ సీరియస్..?

వీరేచనాలు, వాంతులు, కడుపు బలహీనంగా ఉన్న సమయంలో క్యారెట్ తినకూడదు. ఇలాంటి సమయంలో క్యారెట్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యారెట్ జ్యూస్ తాగే ముందు నిపుణుల సూచనలు తీసుకోవాలి. ఇది సహజంగా చక్కెర కలిగి ఉన్నందున రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి. అలాగే ఆరోగ్యంగా ఉండడానికి కొంత మంది క్యారెట్ ఎక్కువగా తింటూ ఉంటారు. పీచు ఎక్కువగా ఉండడం వల్ల క్యారెట్ తిన్నట్లయితే మలబద్ధకం సమస్య పెరుగుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు ఒకటి లేదా రెండు క్యారెట్లు మాత్రమే తినాలి. Carrots

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *