Guava Leaves: జామ ఆకులు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయని వైద్య నివేదికలో వెళ్లడైంది. ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి జామ ఆకులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. షుగర్ పేషెంట్లు సైతం జామ ఆకులు తినాలి. రోజు ఉదయం జామ ఆకులతో తయారుచేసిన టీని తాగినట్లయితే రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. Guava Leaves
Health Benfits With Guava Leaves
చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖంపై ఏర్పడే మచ్చలు, మొటిమలను చిటికెలో తగ్గిస్తాయి. జామ ఆకులు జుట్టు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తాయి. జామ ఆకులను వేడి నీటిలో మరిగించి ఆ నీటిని జుట్టుకు పట్టించి మసాజ్ చేసినట్లయితే కుదుళ్లకు బలం ఏర్పడుతుంది. డయేరియాకు తక్షణ ఉపశమనంగా జామ ఆకులు సహాయం చేస్తాయి. Guava Leaves
Also Read: Senior Indian Players: రోహిత్..కోహ్లీ.. అశ్విన్.. వీరిలో ఎవరికీ మూడిందో!!
శరీరంలో డయేరియాకు కారణం అయ్యే స్టాఫీలోకోక్కస్ ఆరెస్ బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టడంలో సహాయం చేస్తాయి. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. జామ ఆకులను తయారు చేసిన టీని తాగినట్లయితే దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరం అవుతాయి. గొంతు సంబంధిత సమస్యలతో బాధపడేవారు జామకాయ నీటిని తాగాలి. దానివల్ల గొంతు సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా జామ ఆకులతో తయారు చేసిన టీని తాగినట్లయితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Guava Leaves