Lettuce: పాలకూర తింటున్నారా.. చాలా ప్రమాదం అని తెలుసా..?

Lettuce: ఆకుకూరల్లో పాలకూర చాలా మంచిది. ఇది ఎక్కువగా రుచి ఉండకపోవడం వల్ల చాలామంది దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ పాలకూర తినడం వల్ల బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో 13 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీరాన్ని క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చూపు మెరుగు పడుతుంది. Lettuce

Health Benefits With Lettuce

పాలకూర తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉబ్బసం, డయాబెటిస్, మైగ్రేన్ వంటి వ్యాధులను నిరోధిస్తుంది. పాలకూర తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి అందుకే పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చలికాలంలో పాలకూరను కొన్ని రకాల ఆహారాలతో కలిపి అస్సలు తీసుకోకూడదని చెబుతున్నారు వైద్య నిపుణులు. పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పాలు లేదా చీజ్ తో కలిపి తిన్నట్లయితే కాల్షియంతో చర్య జరిపి శరీరంలో కాల్షియం లోటును వెలికితీస్తుంది. అందుకే వీటిని పాలకూరతో కలిపి తీసుకోకూడదు. Lettuce

Also Read: YCP: వైసీపీ పార్టీలోకి… శైలజా నాథ్ తో పాటు మరో బడా నేత?

పాలకూరను పెరుగుతో కూడా కలిపి తినకూడదు. ఒకవేళ తిన్నట్లయితే జీర్ణ సమస్యలు వస్తాయి. పాలకూరలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఒకదానికొకటి చర్య జరిపి జీర్ణ వ్యవస్థను నిర్వహిస్తుంది. పాలకూరలో ఉండే ఆక్సలేట్ నారింజ, ద్రాక్ష వంటి వాటితో కలిపి అసలు తీసుకోకూడదు. ఇలా తిన్నట్లయితే కిడ్నీలో రాళ్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పాలకూరని ఎప్పుడూ కూడా చేపలతో కలిపి తినకూడదు. వీటి కలయిక శరీరంలోని జీర్ణ క్రియ, పోషణ సమతుల్యతను నియంత్రిస్తుంది. అందుకే ఇలాంటి ఆహారాలతో పాలకూరను అస్సలు తినకూడదని పోషకాహార నిపుణులు సూచనలు చేశారు. Lettuce

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *