Mango: ఎండాకాలం మామిడి పండ్లు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి ?
Mango: ఎండాకాలం వచ్చింది అంటే మామిడిపండ్ల సీజన్ ప్రారంభమవుతుంది. మామిడి పండ్లు చర్మ ఆరోగ్యానికి ఎంతగానో సహాయం చేస్తాయి. ఇందులో చర్మానికి తేమను, కాంతిని అందించే గుణాలు అధికంగా ఉంటాయి. అలాగే వృద్ధాప్య ఛాయాలను దూరం చేస్తాయి. దీంతో వృద్ధాప్య సమస్యలు దూరం అవుతాయి. మామిడిలో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటు నుంచి కాపాడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

Health Benefits With Mango in Summer
రక్తహీనత సమస్యలతో బాధపడే వారికి మామిడి పండ్లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. మామిడికాయలు తిన్నట్లయితే ఊబకాయం సమస్య రాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. వేసవిలో తిన్నట్లయితే ఊబకాయం సమస్య తొలగిపోతుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు కూడా మామిడిపండు చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. మామిడి పండ్లు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను తొలగించే గుణాలు ఉంటాయి. అయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మామిడి పండ్లను అతిగా తింటే మాత్రం అనారోగ్యం సంభవిస్తుంది. కావలసినంత మాత్రమే తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.