Mangos: సమ్మర్‌ లో మామిడికాయలు తింటున్నారా.. అయితే జాగ్రత్త ?


Mangos: మామిడి పండ్లు అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ఈ మామిడి పండ్లు వేసవికాలంలో అత్యధికంగా మార్కెట్లలో లభ్యమవుతాయి. ఇక వేసవికాలం అంతా మామిడికాయలు, మామిడిపండు ప్రతి ఒక్కరూ తింటూనే ఉంటారు. అయితే కొంతమంది మాత్రం మామిడి పండ్లు తినడం వల్ల వేడి చేస్తుందని, శరీరంలో మంట పుడుతుందని మామిడి పండ్లను తినడానికి పెద్దగా ఆసక్తిని చూపించరు. మామిడి పండులో కొవ్వు, చక్కెర పదార్థం ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. అయితే మామిడి పండ్లు తినడం వల్ల వేడి చేస్తుందని, శరీరంపై మొటిమలు వస్తాయని అనుకోవడం చాలా తప్పు.

Health Benefits With Mangos

నిజానికి మామిడిపండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటుంది. అయితే మొటిమలు, శరీరంలో మంట, వేడి వంటి సమస్యలతో బాధపడే వారు మాత్రం మామిడిపండ్లను చాలా పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మామిడిపండ్లలో కేలరీలు, చక్కెర తక్కువగా ఉండే మాట నిజమే. మామిడి పండ్లను చాలా తక్కువ పరిమాణంలో తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మామిడి పండ్లు తినడం వల్ల బరువు పెరుగుతామని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదు.

మామిడిపండ్లలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే వీటిని తినాలని అనుకునేవారు తప్పకుండా తినాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మామిడి పండ్లు తినాలి అనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మామిడి పండ్లను తినడం వల్ల కడుపులోని బిడ్డకు ఏమైనా ప్రమాదం వాటిల్లుతుందేమోనని కొంతమంది భావించి వీటిని తినకుండా దూరం పెడతారు. అయితే మామిడిపండులో పోషకాలు ఉండడం వల్ల వీటిని తినడం చాలా మంచిది.

అయితే థైరాయిడ్, డయాబెటిస్ ఉన్న గర్భిణీ స్త్రీలు మాత్రం మామిడి పండ్లను చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అది కూడా మధ్యాహ్నం సమయంలో భోజనం చేసిన అనంతరం తిన్నట్లయితే ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇక కొంతమంది మామిడిపండ్లను నీటిలో నానబెట్టిన అనంతరం తింటూ ఉంటారు. అలా చేయడం వల్ల చాలా మంచిది. మామిడి పండ్లను నీటిలో నానబెట్టిన తర్వాత తిన్నట్లయితే అందులో ఉండే వేడి తొలగిపోతుందని చాలామంది భావిస్తూ ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *