Peanuts Benefits: చాలా మందికి పల్లీలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో వీటిని తినడానికి బాగా ఇష్టపడతారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. వేరుశనగపప్పులో ఐరన్, కాల్షియం, ఫోలేట్, కాపర్, మాంగనీస్, విటమిన్లు, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తాయి. జీర్ణ ప్రక్రియను చురుగ్గా, వేగవంతం చేస్తాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. పల్లీల్లోని విటమిన్ బి3 మెదడు ఆరోగ్యాన్ని చురుగ్గా చేస్తుంది. Peanuts Benefits

Health Benefits With Peanuts

జ్ఞాపక శక్తిని పెంచుతాయి. వయసు ప్రభావం వల్ల వచ్చే ఆల్జీమర్స్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయని పరిశోధనలో వెళ్లడైంది. మారుతున్న మూడ్స్ ను క్రమబద్ధం చేసి యాంటీడిప్రెసెంట్లుగా పనిచేసే ఏమినోయాసిడ్స్ ను పల్లీలు అందిస్తాయి. దానివల్ల ఆందోళన తలెత్తదు. వేరుశనగ ప్రోటీన్లు ఉన్న ఆహారం అయినందున ఆకలి వేయదు. చాలామంది చలికాలంలో పల్లీలను ఎక్కువగా తిట్టారు. కానీ వీటిని సరైన మార్గంలో తినాలి. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. Peanuts

Also Read: BGT 2024: బోర్డర్ – గవాస్కర్ సిరీస్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

ముఖ్యంగా వేయించిన పల్లీలు పెద్ద మొత్తంలో తీసుకుంటే అది కడుపు మీద ప్రభావం చూపిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను కలిగిస్తుంది. పల్లీలను నానబెట్టి తినాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. గుప్పెడు పల్లిలను రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయడం వల్ల శరీరానికి కావాల్సిన కాలుష్యం ప్రోటీన్లు సమృద్ధిగా అందుతాయి. ఎముకలు గట్టి పడతాయి. ముఖ్యంగా పిల్లలకు బెల్లంతో చేసిన వేరుశనగ చిక్కిలను తినిపించాలి. దీని వల్ల శరీరానికి ప్రోటీన్లు, కాల్షియం అందుతాయి. వేయించిన పల్లీలను పరిమిత మోతాదులో మాత్రమే తినాలి. ముఖ్యంగా మసాలా కలిపిన పల్లీలను అసలు తినకూడదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Peanuts