Ponnaganti Kura: ఈ ఆకుకూర తింటే..కాన్సర్ తో పాటు 100 రోగాలు అవుట్ ?


Ponnaganti Kura: ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. మన శరీరంలో ఏర్పడే అనేక రకాల వ్యాధుల నుంచి ఆకుకూరలు శరీరానికి రక్షణ చేకూరుస్తాయి. ముఖ్యంగా పొన్నగంటి కూరది చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. పొన్నగంటి కూర తినడం వల్ల దీర్ఘకాల సమస్యలు దూరం అవుతాయి. Ponnaganti Kura

Health Benefits With Ponnaganti Kura

శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆకులతో కూర చేసుకునే తినడం వల్ల చాలా వరకు బరువు తగ్గుతారు. పొన్నగంటి ఆకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పొన్నగంటి కూరను తరచూ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ముఖ్యంగా మగవారిలో వీర్య కణాల్లోని లోపాలు తొలగిపోతాయి. నరాల నొప్పి, వెన్నునొప్పికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. మధుమేహంతో బాధపడేవారు ఈ ఆకుతో కూరని చేసుకొని తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. Ponnaganti Kura

Also Read: Oninons: ఉల్లిగడ్డలు తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి?

ఒక టేబుల్ స్పూన్ తాజా ఆకుల రసంలో వెల్లుల్లి కలుపుకొని తీసుకున్నట్లయితే దగ్గు, ఆస్తమా సమస్యలు తొలగిపోతాయి. క్యాన్సర్ నివారించడానికి పొన్నగంటి కూర సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. రక్త పోటును నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్లు అధికంగా ఉంటాయి. పొన్నగంటి ఆకులు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. వారంలో ఒక్కసారైనా పొన్నగంటి ఆకు కూరను తినాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. దానివల్ల శరీరానికి, చర్మ సౌందర్యానికి కంటి చూపుకు చాలా మంచి కలుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Ponnaganti Kura

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *