Radish: ముల్లంగి తింటున్నారా.. అయితే.. ఒక్క నిమిషం ?
Radish: ముల్లంగి ఇది దుంప జాతికి చెందినది. సాధారణంగా ముల్లంగిని కూరగాయగా ఉపయోగిస్తారు. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జ్యూస్ రూపంలో చేసుకొని తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ముల్లంగి రసం తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీరానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి. ముల్లంగి రసం తాగినట్లయితే కడుపు శుభ్రంగా ఉంటుంది.

Health Benefits With Radish
రక్తంలోని వ్యర్ధపదార్థాలు అన్ని బయటకు తొలగిపోయి ఎముకలు దృఢంగా తయారవుతాయి. ముల్లంగిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. ముల్లంగిలో ఖనిజాలు అధికంగా ఉంటాయి. వారానికి రెండు మూడు సార్లు జ్యూస్ రూపంలో దీనిని తీసుకోవాలి. ఇందులో పొటాషియం, ఫోలేట్, విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.
ముల్లంగి రసంలో కొవ్వును కరిగించే పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ఎంతో చక్కగా పనిచేస్తుంది. ముల్లంగి రసం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ముల్లంగి రసం తాగకపోవడమే మంచిది. అయితే ముల్లంగి రసం కేవలం ఒక గ్లాసు మాత్రమే తాగాలి. టేస్టీగా ఉంది కదా అని ఎక్కువగా తాగినట్లయితే అనారోగ్య ప్రయోజనాలు కోరుతాయి చేకూరుతాయి.