RamaPhal: రామా ఫలం ఈ పండు చాలామందికి తెలుసు. ఎక్కువగా ఎవరు తినరు. కానీ దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా రామా ఫలం తినడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులోని పిరిడాక్సిన్ మెదడులోని కణాలకు అవసరమైన రసాయనాలను స్థిరంగా ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తాయి. రామా ఫలంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. RamaPhal
Health Benefits With Ramphal
దీంతో తరచూ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. రామా ఫలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు ముఖంపై ఏర్పడే ముడతలు, మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను నయం చేస్తాయి. షుగర్ పేషంట్లు సైతం ఈ పండును ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. ఇది రక్తంలోని గ్లూకోస్ ని తగ్గించడంలో ఎంతో చక్కగా సహాయపడుతుంది. రామా ఫలం చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా స్కిన్ ఎలర్జీ, ఎగ్జిమా వంటి వాటిని ఈ పండు నయం చేస్తుంది. RamaPhal
Also Read: Smita Sabharwal: స్మితా సబర్వాల్‌కు రేవంత్ బంపర్ గిఫ్ట్.. ?
ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండును తరచూ తినడం చాలా మంచిది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. రామఫలం క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. వీటిలో ఉండే అనునాసిన్ అనోకాటలిన్ వంటివి క్యాన్సర్ కణాల పెరుగుదల వ్యాప్తిని నిరోధించడానికి సహాయం చేస్తాయి. ఇక వారంలో రెండు సార్లైనా రామా ఫలాన్ని తినాలని వైద్యనిపుణులు సూచనలు చేస్తున్నారు. RamaPhal