Raw Onion: ఉల్లిపాయ తినే అలవాటు ఉందా..జాగ్రత్త మరి?

Raw Onion: ఉల్లిపాయను తినడం చాలామందికి ఇష్టం. చాలా మంది భోజనం చేసే సమయంలో పచ్చి ఉల్లిపాయను సలాడ్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ తినే సమయంలో పచ్చి ఉల్లిపాయ తప్పకుండా ఉండాల్సిందే. ఎంతో ఇష్టంగా పచ్చి ఉల్లిపాయను తింటారు. అయితే కొందరు స్పెషల్, స్పైసీ ఫుడ్ తీసుకున్న సమయంలో పచ్చి ఉల్లిపాయను తింటే, మరికొందరు ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటారు.

Health Benefits With Raw Onion

అయితే పచ్చి ఉల్లిపాయను ప్రతి రోజు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అన్నే అనారోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట. ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయను తినడం వలన జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పచ్చి ఉల్లిపాయను అసలు తీసుకోకూడదట.

Also Read: Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ అద్భుతమైన శతకం.. ప్రముఖుల ప్రశంశలు!!

దీని వలన కడుపు ఉబ్బరం, గ్యాస్టిక్, గుండెలో మంట వంటి అనేక సమస్యలు వస్తాయట. అలాగే రక్తం పలుచబడడానికి మందులు వాడేవారు పచ్చి ఉల్లిపాయను తినే ముందు వైద్యుడు సలహాలు తీసుకోవాలి. పచ్చి ఉల్లిపాయను తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. అందువలన రోజులో సగం ఉల్లిపాయ కన్నా ఎక్కువగా తీసుకోకూడదట. దానివల్ల అనారోగ్యం సంభవిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *