Roasted Black Chana: డైలీ వేయించిన శనగలు తింటే..మంచి ఫలితాలు ?
Roasted Black Chana: సాయంత్రం సమయంలో ఏమైనా స్నాక్స్ తినాలని అనిపించినప్పుడు గుప్పెడు వేయించిన శనగలు తిన్నట్లయితే చాలా మంచిది. శనగలతో పాటు బెల్లం కలుపుకొని తింటే రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా కడుపు నిండుగా ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరగదు. ఇందులో విటమిన్లు, ఐరన్, కాల్షియం, కాపర్, జింక్, పొటాషియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. Roasted Black Chana
Health Benefits With Roasted Black Chana
ఈ పోషకాలు రక్తంలో గడ్డలు కట్టకుండా అరికడతాయి. ముఖ్యంగా చలికాలంలో ప్రతిరోజు వేయించిన శనగలు బెల్లంతో కలిపి తింటే చాలా మంచిది. ఈ రెండు కూడా శరీరానికి పోషకాలను అందిస్తాయి. వీటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎక్కువసేపు బలంగా శక్తివంతంగా ఉంచడానికి సహాయం చేస్తాయి. పిల్లలు, వృద్దులతో సహా ప్రతి ఒక్కరు వీటిని తినవచ్చు. వాతావరణంలో ఏర్పడే మార్పుల కారణంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు ఏర్పడతాయి. Roasted Black Chana
Also Read: WTC: టీమిండియా WTC చేరాలంటే… ఇలా జరగాల్సిందే ?
అలాంటి సమయంలో శనగలు, బెల్లం కలిపి తిన్నట్లయితే రోగనిరోధక శక్తి బలపడుతుంది. బెల్లంలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. ఐరన్ తీసుకోవడం వల్ల శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది. బెల్లం, శనగలు తిన్నట్లయితే ఎముకలు బలపడతాయి. బెల్లంలో కాల్షియం ప్రోటీన్లు కండరాలను బలంగా తయారుచేస్తాయి. జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. చిన్నపిల్లలకు సైతం బెల్లం, శనగలు కలిపి పెట్టినట్లయితే వారి పెరుగుదల సజావుగా సాగుతుంది. ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.Roasted Black Chana