Vinegar: వెనిగర్ వాడుతున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే ?
Vinegar: వెనిగర్ ని మాంసాహార వంటలు, పచ్చళ్ళు, నిల్వ ఆహారాలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి బ్రూడ్ వెనిగర్. దీనిని సహజమైన ఆహార పదార్థాల నుంచి తయారు చేస్తారు. యాపిల్, బియ్యం, తేనే, బంగాళదుంపలు ఇలా వివిధ రకాల పదార్థాల నుంచి వెనిగర్ తయారు చేస్తారు. ఇది మంచిదా కాదా అంటే మంచిదనే చెప్పవచ్చు. ఇందులో పోషకాలు ఉంటాయి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

Health Benefits With Vinegar
మాంసాహార వంటలు, పచ్చళ్ళు, బ్యాక్టీరియా వైరస్ ల నుంచి వెనిగర్ రక్షణను ఇస్తుంది. ఇక రెండో రకం ఆర్టిఫిషియల్ వెనిగర్ పల్చగా చేసిన ఎసిడిక్ యాసిడ్ ఇది. ఇది తినడానికి చాలా అనువుగా ఉంటుంది. కాబట్టి వంటలలో వెనిగర్ ని తప్పకుండా వాడుకోవచ్చు. సాధారణంగా వెనిగర్ ఆహార రుచిని పెంచడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా మేలును చేస్తుంది. జుట్టు, చర్మ సంరక్షణతో పాటు మానసిక అనారోగ్యం, గుండె జబ్బులు వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు వెనిగర్ ని వాడవచ్చు.
రోజు ఒక చెంచా వెనిగర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. వెనిగర్ జీవప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది. వెనిగర్ వాడడం వల్ల అనేక రకాల వ్యాధులు తొలగిపోతాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. గ్లాసు నీరులో ఒక చెంచా వెనిగర్ కలిపి తాగడం వల్ల కడుపులో చికాకు, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు కూడా నియంత్రణలో ఉంటారు.