Chapathi: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో చాలామంది బయటి ఆహారాన్ని తినడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతున్నారు. ఆ బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతున్నారు. బరువు తగ్గడానికి చాలామంది డైటింగ్, జిమ్ లో విపరీతంగా సాహసాలు చేస్తూ ఫెయిల్ అవుతున్నారు. బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేసేవారు ప్రతిరోజు చపాతీలు తిన్నట్లయితే సులభంగా బరువు తగ్గవచ్చు. చపాతీలు తినడం వల్ల శరీరంలోని కొవ్వు సులభంగా కరుగుతుంది. Chapathi
Health Benfits Chapathi over rice
వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇక షుగర్ పేషెంట్స్ తప్పకుండా ప్రతిరోజు చపాతీలు తినాలి. షుగర్ పేషెంట్స్ అన్నం తిన్నట్లయితే వారికి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. చపాతీలు తినడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవారు చపాతీలు తినడం మంచిది. ఎందుకంటే చపాతీలకి చాలా తక్కువగా నూనెని వాడుతారు. ఇక ప్రతిరోజు రెండు, మూడు చపాతీలను తిన్నట్లయితే బరువు సులభంగా తగ్గుతారు. Chapathi
Also Read: Hyundai Inster EV: హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. 150 KM మైలేజ్ ?
వీటిలో కొవ్వు పదార్థాలు అస్సలు ఉండవు. ఈ చపాతీలకి ఆకుకూరలు ఎక్కువగా పెట్టుకుని తిన్నట్లయితే చాలా మంచిది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అవి గుండెకి ఎంతో మేలును చేస్తాయి. ముఖ్యంగా జ్వరం వచ్చిన వారు చపాతీలను తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. చపాతీలని ఉదయం పూట కాకుండా రాత్రిపూట తినాలి. ఇక రాత్రిపూట తిన్న వెంటనే పడుకోకుండా రెండు గంటల తర్వాత పడుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. Chapathi
చపాతీలను థైరాయిడ్ పేషెంట్లు కూడా తినడం చాలా మంచిది. థైరాయిడ్ ఉన్నవారు విపరీతంగా బరువు పెరుగుతూ ఉంటారు. వారికి సులభంగా కొవ్వు పెరుగుతూ ఉంటుంది. తద్వారా చపాతీలు తిన్నట్లయితే సులభంగా బరువు తగ్గవచ్చు. చిన్నపిల్లలకి కూడా చపాతీలను తినిపించడం చాలా మంచిది. చపాతీలో విటమిన్స్, పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజు చిన్న పిల్లలకు ఒక చపాతి తినిపించడం చాలా మంచిదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.Chapathi