Amla: ఆయుర్వేదంలో నేల ఉసిరి చెట్టుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఈ మొక్క అనేక వ్యాధులకి, రుగ్మతలకి వైద్య విధానంలో ఎంతో సహాయం చేస్తుంది. నేల ఉసిరి వేర్లు, ఆకులు, కాండం, కాయలు, పువ్వులు ఈ చెట్టు నుండి ఏర్పడే పాలు అన్ని రకాల ఆయుర్వేద మందుల్లో వాడుతారు. నేల ఉసిరి జ్యూస్ కిడ్నీలో ఏర్పడే స్టోన్స్ తో పాటు కిడ్నీ వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. హైపటైటిస్, కాలేయ ఆరోగ్యానికి నేల ఉసిరి కామెర్ల వ్యాధులకు మంచి ఔషధం అని చెప్పవచ్చు. Amla

Health Benfits With Amla leaves

కంటి సమస్యలకు నేల ఉసిరి మంచి మందు. ఈ రసాన్ని ఉదయం కాలి కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో కనుక తాగినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. డయాబెటిస్ పేషెంట్లకు ఈ జ్యూస్ చాలా మంచిది. నేల ఉసిరి రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించే శక్తిని కలిగి ఉంటాయి. ఈ మొక్క వేర్లను రోట్లో వేసి లేదా మిక్సీలో వేసి మెత్తగా చేసి దాని నుంచి వచ్చిన రసాన్ని పెరుగులో కలుపుకొని ఉదయం పూట సాయంత్రం పూట తాగినట్లయితే కామెర్లు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. Amla

Also Read: Shikhar Dhawan – NPL 2024: నేపాల్‌ కు వెళ్లిపోతున్న శిఖర్ ధావన్ ?

గజ్జి, తామర వంటి చర్మ సమస్యలకు నేల ఉసిరి మంచి ఔషధం. ఈ మొక్కను పేస్ట్ చేసి అందులో చిటికెడు ఉప్పుతో కలిపి గజ్జి, తామర ఉన్నచోట రాసినట్లయితే తక్షణమే గజ్జి తామర తొలగిపోతుంది. చిన్నపిల్లలకు చాలావరకు ఆకలి ఉండదు. అలాంటివారు నేల ఉసిరి మొక్కలను ఆకులను ఉదయం, సాయంత్రం కొద్దిగా తిన్నట్లయితే క్రమక్రమంగా చిన్నపిల్లలకు ఆకలి పెరుగుతుంది. Amla