Betel Leaf: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో కలుషిత వాతావరణం కారణంగా చాలామందికి అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. ఇక చిన్న చిన్న జబ్బులకు కూడా ప్రతి ఒక్కరూ హాస్పిటల్స్ చుట్టూ తిరగడం…. మందులు వాడడం వంటి పనులు చేస్తున్నారు. ప్రతి చిన్న దానికి మందులు వాడడం మంచిది కాదని…. మన ఇంట్లో ఉండే వంటింటి వస్తువులతోనే ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో చెట్లను తప్పనిసరిగా పెంచుతూ ఉంటారు. Betel Leaf
Health Benfits With Betel Leaf
అలాంటి వాటిలో తమలపాకు చెట్టు ఒకటి. తమలపాకు చెట్టు ఉండడం వల్ల ఇంటికి చాలా మంచిది. ఈ చెట్టును పెంచడానికి ప్రత్యేకమైన స్థలం అవసరం లేదు. చిన్న కుండీలో మొక్కను నాటితే సరిపోతుంది. పెద్ద వృక్షంలా తయారవుతుంది. అంతేకాకుండా తమలపాకులు, దానివేర్లు మన శరీరంలోని అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుతాయి. తమలపాకులను దేశ విదేశాల్లో చాలా రకాల ఔషధాల కోసం ఉపయోగిస్తుంటారు. తమలపాకులు గొంతుకు సంబంధించిన వ్యాధులకు, దంత సమస్యలకు చక్కటి పరిష్కారం. తమలపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడటంతో పాటుగా…. మలబద్ధకం, జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. Betel Leaf
Also Read: IPL 2025: షారుఖ్, ప్రీతీ మధ్య గొడవలు.. ఐపీఎల్ 2025 రద్దు ?
జలుబు, దగ్గు, ఆయాసం వంటి సమస్యలతో బాధపడేవారికి తమలపాకులు చక్కగా పనిచేస్తాయి. తమలపాకులకు గుండె సంబంధిత వ్యాధులను నయం చేసే శక్తి ఉంటుంది. ఇక తమలపాకులే కాకుండా తమలపాకు వేర్లను కూడా నీటిలో కలిపి తీసుకోవాలి. వేర్లను తీసుకోవడం నచ్చని వారు అందులోంచి రసాన్ని తీసుకొని ప్రతిరోజు నీటిలో కలుపుకొని తాగాలి. ఇంకా తమలపాకులను పొడి చేసుకొని దంత సమస్యలు ఉన్నవారు, చిగుళ్ల సమస్యలతో బాధపడేవారు ఆ పొడిని వాడినట్లయితే నోటిసమస్యలు తొలగిపోతాయి. ఇక చాలామంది అధిక బరువుతో బాధపడేవారు తమలపాకులను వాడినట్లయితే బరువు తగ్గడానికి ఎంతో బాగా పనిచేస్తాయి. తమలపాకు నీటిని తాగడం వల్ల గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. గుండెమంటను తగ్గిస్తుంది. Betel Leaf
ప్రతిరోజు తమలపాకులను తీసుకోవడం వల్ల నొప్పులు తొలగిపోతాయి. తమలపాకులను పరగడుపున తింటే చాలా మంచిదని వైద్యనివేదికలో వెళ్లడైంది. తమలపాకులను, వాటి వేర్లను చాలా రకాల మందులలో వాడుతారు. పూర్వకాలంలో తమలపాకులను అందరూ తినేవారు. అప్పుడు వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండేవి కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు తమలపాకులను ఎవ్వరూ తినడం లేదు. అయితే తమలపాకులను ప్రతి ఒక్కరూ తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది తమలపాకులను పూజలకు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. పూజలకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో చక్కగా పనిచేస్తాయని వైద్యులు సూచనలు చేస్తున్నారు. Betel Leaf