Chia Seeds: చలికాలంలో ఈ గింజలు నీటిలో నానబెట్టి ఉదయం తాగితే..100 రోగాలు దూరం ?
Chia Seeds: చియా గింజలు చాలామంది వాడుతూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలను కలిగిస్తాయి. దీనిని మంచి ఔషధంగా ఉపయోగిస్తున్నారు. వీటిని ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహారంగా తీసుకుంటారు. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చియా గింజలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. అధిక బరువును తగ్గిస్తాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు విపరీతంగా ఉండడం వల్ల జీర్ణ క్రియ మెరుగుగా ఉంటుంది. Chia Seeds

Health Benfits With Chia Seeds
ఇందులో విటమిన్లు ఉంటాయి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల రక్తంలోని చక్కర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. శీతాకాలంలో చియా విత్తనాలు చర్మ సంరక్షణకు మేలును కలిగిస్తాయి. శరీరం హైడ్రేట్ గా ఉంచడంలో సహాయం చేస్తాయి. ఇవి చర్మాన్ని సహజంగా, తేమగా మార్చే కొవ్వు ఆమ్లాలు. విటమిన్లు, మినరల్స్ లాంటి ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. చియ విత్తనాలు జలుబు, ఫ్లూకి వ్యతిరేకంగా పోరాడడంలో పని చేస్తాయి. Chia Seeds
Also Read: Mohamed Amaan: 16 ఏళ్లకే అనాధ..కానీ ఇప్పుడు టీంఇండియా స్టార్ ?
మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం సమస్యలను చియా గింజలు దూరం చేస్తాయి. చియా గింజలు గుండె జబ్బులను సైతం నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. ఇందులో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల ఆకలి వేయదు. తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. తద్వారా బరువు కంట్రోల్ లో ఉంటుంది. వీటిని చాలామంది జ్యూస్ లలో వాడితో ఉంటారు. కొంతమంది ఫ్రూట్ సలాడ్ వంటి వాటిలో కూడా వినియోగిస్తారు. ఏదో ఒక రకంగా చియా సీడ్స్ తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. Chia Seeds