Fenugreek Seeds: మొలకెత్తిన మెంతి గింజలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం. నేటికాలంలో చాలామంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారు మొలకెత్తిన మెంతి గింజలను తీసుకున్నట్లయితే మధుమేహం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మెంతికూర తినాలని చెబుతున్నారు. ప్రతిరోజు పావు స్పూను మెంతి గింజలను నీటిలో నానబెట్టుకొని ఆ నీటిని ఉదయం పూట తాగి …..మొలకెత్తిన మెంతి గింజలను తిన్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. Fenugreek Seeds
Health Benfits With Fenugreek Seeds
మొలకెత్తిన మెంతులు తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగుగా ఉంటుంది. ప్రతిరోజు మొలకెత్తిన మెంతులు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. రుతుక్రమం సమస్యతో బాధపడే స్త్రీలు మొలకెత్తిన మెంతులు తినడం వల్ల సమస్య తగ్గిపోతుంది. ఉబ్బరం, జీర్ణక్రియ వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా రక్తపోటు సమస్య తొలగిపోతుంది. మొలకెత్తిన మెంతులు శరీరంలోని కొలెస్ట్రాల్, బీపీ, మలబద్ధకం, అల్సర్ వంటి అనేక సమస్యలను నయం చేస్తుంది. Fenugreek Seeds
Also Read: Hardik Pandya: ఆ అమ్మాయితో బెడ్ రూంలో దొరికిపోయిన పాండ్యా..?
మొలకెత్తిన మెంతులలో పోషక విలువలు అధికంగా ఉండడం వల్ల కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇందులో విటమిన్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఉండడంవల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. తద్వారా ప్రతి ఒక్కరూ మొలకెత్తిన మెంతులను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక మెంతులు ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి ఎంతో చక్కగా పనిచేస్తాయి. Fenugreek Seeds
మెంతులను పేస్ట్ చేసుకుని ముఖానికి అప్లై చేసుకున్నట్లయితే మొటిమలు వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇక అంతేకాకుండా మెంతులను పేస్ట్ చేసుకుని జుట్టుకు అప్లై చేసినట్లయితే జుట్టు బలంగా, ఒత్తుగా తయారవుతుంది. జుట్టు రాలడం వంటి సమస్యలు తొలగిపోతాయి. కుదుళ్లు బలంగా తయారయ్యి జుట్టు ఊడటం వంటి సమస్యలు ఉండవు. అందుకే ప్రతి ఒక్కరూ మెంతులను తినడంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా వాడాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వారానికి రెండుసార్లు అయినా మెంతులను పేస్ట్ చేసుకుని జుట్టుకు, ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. Fenugreek Seeds