Oninons: ఉల్లిగడ్డలు తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి?
Oninons: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని మన పెద్దలు అంటూనే ఉంటారు. దానికి తగినట్టుగానే ప్రతి ఇంట్లో ఉల్లిపాయలు నిల్వ చేసుకుంటారు. ఉల్లిగడ్డ లేని కూర అస్సలు చేయరు. ఉల్లిగడ్డలు చాలా రకాలుగా దొరుకుతాయి. అందులో ఎర్ర ఉల్లితో పాటు, తెల్ల ఉల్లిగడ్డ ఎక్కువగా లభిస్తుంది. వీటిలో ఏ రంగు ఉల్లిగడ్డ తింటే మంచిది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఎర్ర ఉల్లిగడ్డలతో పోలిస్తే తెల్ల ఉల్లిగడ్డలలోనే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. Oninons

Health Benfits With Oninons
ముఖ్యంగా తెల్ల ఉల్లిగడ్డలో ఉండే విటమిన్ సి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. తెల్ల ఉల్లిని పచ్చిగా కానీ, ఉడికించి కానీ ఆహారంగా తీసుకోవచ్చు. దానివల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసే శక్తి ఉంటుంది. తెల్ల ఉల్లిగడ్డలను ఔషధాల తయారీలో చాలా వరకు ఉపయోగిస్తారు. వీటిలో ఉండే సల్ఫర్ రక్తంలోని చక్కర నియంత్రణకు ఉపయోగపడుతుంది. తెల్ల ఉల్లిని క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మధుమేహం అదుపులో ఉంటుంది. Oninons
Also Read: Cm Revanth Reddy: కొడంగల్ కు గుడ్ బాయ్.. కొత్త నియోజకవర్గం వేటలో రేవంత్ ?
ఇందులో సల్ఫర్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి. శరీరంలో కనితి పెరుగుదలను నిరోధించడానికి సహాయం చేస్తుంది. తెల్ల ఉల్లి యాంటీ ఆక్సిడెంట్లను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ ను చాలా వరకు తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అధిక రక్తపోటును తొలగించడానికి, రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి తెల్ల ఉల్లిగడ్డ ఎంతగానో సహాయపడుతుంది. అందుకే చాలా వరకు తెల్ల ఉల్లిగడ్డను మాత్రమే తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. Oninons