Papaya: ఉదయం పూట బొప్పాయి పండు తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేరుకుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం…. బొప్పాయిలో పొటాషియం, ఫైబర్, ఫోలేట్, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఒక కప్పు నిండా బొప్పాయి పండు ముక్కలు తిన్నట్లయితే ఆరోగ్యానికి కావాల్సినన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. Papaya
Health Benfits With Papaya
ఖాళీ కడుపుతో బొప్పాయి పండు తిన్నట్లయితే జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. దానివల్ల పోట్ట సమస్యలు తొలగిపోతాయి. చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడతారు. అలాంటి వారు దీనిని తిన్నట్లయితే మలబద్ధకం తొలగిపోయి చురుగ్గా ఉంటారు. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. పేగు సమస్యలు తొలగిపోతాయి. అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి. బొప్పాయి పండు డయాబెటిక్ పేషెంట్లు తీసుకున్నట్లయితే రక్తంలో చక్కర స్థాయిలు తొలగిపోతాయి. Papaya
Also Read: Rashid Khan: రషీద్ ఖాన్ వివాహం…ఏకంగా 4 గురుది ఒకేసారి ?
దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చక్కర స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. షుగర్ పేషెంట్లు బొప్పాయి పండును ప్రతిరోజు వారి ఆహారంలో ఒక భాగం చేసుకోవాలి. ఇందులో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు బొప్పాయి పండును తప్పకుండా తినాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దానివల్ల ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తీసుకుంటారు. సులభంగా బరువు తగ్గుతారు. Papaya