Roasted Chana: స్నాక్స్ తినడం అంటే చాలామందికి ఇష్టముంటుంది. ప్రతి ఒక్కరూ స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక సింపుల్ స్నాక్స్ లలో వేయించిన శనగలు ఒకటి. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా దీనివల్ల ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. శనగలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. శనగలలో విటమిన్స్, ఐరన్, కాపర్, మాంగనీస్, బి6 వంటి పోషకాలు ఉంటాయి. Roasted Chana

Health Benfits With Roasted Chana

శనగల్లో ఫైబర్, ప్రోటీన్ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పీచు శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. వేయించిన శనగలు తిన్నట్లయితే కడుపు నిండుగా ఉంటుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు ఆహారం తక్కువగా తీసుకుంటారు. దానివల్ల సులభంగా బరువు తగ్గుతారు. శనగలు అతిగా ఆహారం తీసుకోకుండా చేస్తాయి. శనగల్లో కేలరీల శాతం తక్కువగా ఉంటుంది. Roasted Chana

Also Read: Tamannaah Bhatia: పాక్ క్రికెటర్ తో తమన్నా పెళ్లి?

చాలా మంది శనగలు తినడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే వేయించిన శనగలు ప్రతిరోజు తిన్నట్లయితే చాలా మంచిది. ఇక కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు శనగలు తినే ముందు వైద్య నిపుణులను సంప్రదించాలి. చిన్నపిల్లలకు కూడా సాయంత్రం సమయంలో ఒక గుప్పెడు శనగలను తినిపించాలి. దానివల్ల వారి పెరుగుదల బాగుంటుంది. Roasted Chana