Sunflower Seeds: సన్ ఫ్లవర్ విత్తనాలు ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం పూట ఒక చెంచాడు పొద్దుతిరుగుడు విత్తనాలు తిన్నట్లయితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తొలగిపోయి ఆరోగ్యంగా తయారవుతారు. అంతేకాకుండా సన్ ఫ్లవర్ విత్తనాలు గుండె చుట్టూ పేరుకుపోయిన చెడు కొవ్వును తొలగించి రక్తశుద్ధిని చేస్తుంది. Sunflower Seeds
Health Benfits With Sunflower Seeds
అంతేకాకుండా రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడానికి ముఖ్యపాత్ర పోషిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ ఈ ఉండడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి బలపడుతుంది. సన్ ఫ్లవర్ విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ వంటి కణాల నుంచి కాపాడుతాయి. ఈ విత్తనాలను ప్రతిరోజు తిన్నట్లయితే శరీరంలో వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నట్లయితే తొలగిపోతాయి. సన్ ఫ్లవర్ విత్తనాలలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.
Also Read: K.L. Rahul: రాహుల్ కోసం ఐపీఎల్ లో 50 కోట్లు.. ముంబై వైస్ బెంగళూరు జట్ల పోటీ!!
దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. షుగర్ పేషెంట్లకు సన్ ఫ్లవర్ విత్తనాలు ఒక వరం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ విత్తనాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తొలగిస్తాయి. షుగర్ క్రమక్రమంగా తగ్గుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు తిన్నట్లయితే ఎముకలు బలంగా తయారవుతాయి. ఈ విత్తనాలు ఎముకలను ధృఢంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. చాలామంది గర్భిణీ స్త్రీలు పొద్దుతిరుగుడు విత్తనాలను తినడానికి ఆసక్తిని చూపిస్తారు. ఇందులో విటమిన్ ఈ ఉండడం వల్ల కడుపులోని బిడ్డ పెరుగుదల సజావుగా సాగుతుంది. ఎలాంటి లోపాలు లేకుండా కడుపులోని శిశువు ఆరోగ్యంగా తయారవుతారు. డైట్ ఫాలో అయ్యేవారు సన్ ఫ్లవర్ విత్తనాలను తప్పకుండా వారి డైట్ మెనూలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.