Tamarind Leaf Tea: టీ తాగడానికి చాలామంది ఆసక్తిని చూపిస్తారు. కొంతమంది పని నుంచి రిలాక్స్ కోసం, ఒత్తిడి తగ్గించుకోవడానికి టీ తాగుతూ ఉంటారు. ఇక మరికొందరికి ఉదయం లేచిన వెంటనే టీ తాగకుండా ఏ పని కూడా ప్రారంభించరు. ఒకానొక సమయంలో కేవలం పాలతో తయారు చేసిన టీని మాత్రమే తాగేవారు. ఇప్పుడు చాలా రకాల టీలు అందుబాటులోకి వచ్చాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, తులసి టీ, మసాలా టీ, అల్లం టీ అని ఎన్నో రకాలుగా చూసాం. Tamarind Leaf Tea

Health Benfits With Tamarind Leaf Tea

అయితే ఇప్పుడు కొత్తగా చింత ఆకు టీని కూడా చాలామంది తాగుతున్నారు. చింత ఆకుల ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. వీటితో టీ చేసుకుని తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని వైద్య నివేదికలో వెళ్లడైంది. ఇలా టీ చేసి తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి. వీటిలో ఉండే పాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ గుణాలు శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. Tamarind Leaf Tea

Also Read: Sanju Samson: ఈ అమ్మాయితో సంజు శాంసన్ కు టార్చర్‌ ?

ఇది గుండె సంబంధిత సమస్యలను తొలగించడానికి సహాయపడతాయి. బరువు ఉన్నవారు చింత ఆకుల టీని తాగడం చాలా మంచిది. ఇందులో యాంటీ ఒబేసిటీ గుణాలు ఉంటాయి. ఇది జీవక్రియను పెంచుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ జలుబు, దగ్గు వంటి అంటువ్యాధుల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. అంతే కాకుండా శరీరంలోని వాపులు, నొప్పులు వంటి సమస్యలను కూడా తొలగిస్తాయి. ఇక వారంలో కనీసం రెండు సార్లు అయినా చింత ఆకులతో తయారు చేసిన టీని తాగాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Tamarind Leaf Tea