Mushroom: పుట్ట గొడుగులు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి ?
Mushroom: చికెన్, మటన్ తినని వారు దాని స్థానంలో పుట్టగొడుగులని తింటారు. ఇవి చాలా మంచిగా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి. పుట్టగొడుగుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి అనేక రకాల పోషకాలను అందిస్తాయి. పుట్టగొడుగులలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. వీటిని రోజు తినడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. పుట్టగొడుగులు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే సమస్యలు తగ్గిపోతాయి.
Health Benifits of mushrooms
ఇందులో ఉండే సోడియం, పొటాషియం నిష్పత్తి తక్కువగా ఉంటుంది. దీని వల్ల బిపి కంట్రోల్ లో ఉంటుంది. పుట్టగొడుగులలో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి సహాయం చేస్తుంది. ప్రతిరోజు మెదడు సామర్థ్యం పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే దీనిని తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వీటిని అస్సలు తినకూడదు.
Rishabh Pant: రిషబ్ పంత్ కు ఢిల్లీ కెప్టెన్సీ ?
పుట్టగొడుగులను తినడం వలన కొంతమందికి చర్మ అలర్జీ సమస్యలు ఏర్పడతాయి. ఇప్పటికే అలర్జీ, శ్వాస కోస, ఇతర సమస్యలతో బాధపడేవారు పుట్టగొడుగులని తీసుకోకూడదు. దీనివల్ల చర్మంపై దద్దులు, చికాకు వంటి లక్షణాలు ఏర్పడతాయి. అంతేకాదు పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కు నుంచి రక్తం కారడం, ముక్కు, గొంతు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. కొందరు తలనొప్పి సమస్యతో బాధపడతారు పుట్టగొడుగులు తినకపోవడమే చాలా మంచిది.