Chapatis: నేటి కాలంలో కొంతమంది అధిక బరువు సమస్యతో బాధపడతారు. ముఖ్యంగా బరువు తగ్గాలని, పొట్ట తగ్గించుకోవాలని విపరీతమైన సాహసాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పొట్ట తగ్గించుకోవాలని చూసేవారు చపాతీలను ఎక్కువగా తింటారు. చపాతీలను క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు తగ్గుతామని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చపాతీలను అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు ముఖ్యంగా చాలా వరకు చపాతీలను తింటారు. అన్నం అసలు తినరు. Chapatis

Health Bensits With Chapatis At Night

కానీ డయాబెటిస్ ఉన్నవారు చపాతీలను అస్సలు తినకూడదట. ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల చక్కెర స్థాయిలను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా అలసిపోతూ ఉండేవారు చపాతీలను తినకూడదట. ఇందులో కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. దీనివల్ల అలసట, నీరసం మరింత పెరుగుతాయి. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కూడా చపాతీలను తినకూడదు. ఎందుకంటే గోధుమలలో గ్లూటెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల థైరాయిడ్ వ్యాధిని అధికంగా పెంచుతాయి. బరువు తగ్గించుకోవాలనుకునే వారు కూడా అన్నం తినకుండా చపాతీలను తింటారు. Chapatis

Also Read: Koushik Reddy: దుబాయ్ లో రేవంత్ రెడ్డి ఏమేం చేసిండో చెప్తే.. భార్య, బిడ్డ కూడా ఇంటికి రానివ్వదు!

అయితే గోధుమలలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరంలోని కొవ్వును నిల్వ చేయడానికి కారణం అవుతాయి. దానివల్ల సులభంగా బరువు పెరుగుతారు. చపాతీలు తినడం వల్ల ఎక్కువగా గ్యాస్ తయారవుతుంది. ఎసిడిటీ, అజీర్ణం, జీర్ణ సమస్యలు వస్తాయి. గోధుమలలో గ్లూటెన్ పేగులలోని మంటను పెంచుతుంది. దానివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపునొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు కూడా చపాతీలను తినకపోవడమే మంచిది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు చపాతీలను అస్సలు తినకూడదు. దానివల్ల గుండెలో మంట ఏర్పడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. Chapatis