Biscuits: బిస్కెట్ ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే స్నాక్స్. చాలామంది పిల్లలు, పెద్దవారు బిస్కెట్ ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా టీ లేదా కాఫీ తాగిన సమయంలో బిస్కెట్స్ తినడం సర్వసాధారణం. అయితే బిస్కెట్స్ ఎక్కువగా తినడం వల్ల చాలా రకాల సమస్యలు ఉంటాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా మైదాపిండి, సోడియం, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉండడంవల్ల ఆరోగ్యానికి చాలా హాని జరుగుతుందని చెబుతున్నారు. Biscuits
Health Issues With Biscuits
ముఖ్యంగా మైదాపిండితో చేసిన బిస్కెట్స్ తినడం వల్ల జీర్ణక్రియకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. దానివల్ల మలబద్ధకం సమస్యలు వస్తాయి. బిస్కెట్స్ తయారీలో మైదాపిండితో పాటుగా పంచదారని చాలావరకు ఉపయోగిస్తారు. దాని వల్ల దంత సమస్యలు తయారవుతాయి. అంతేకాకుండా డయాబెటిస్ సమస్యలు ఎదురవుతాయి. పంచదార, ఫ్యాట్, ఉప్పు ఉపయోగించి బిస్కెట్స్ తయారు చేయడం వల్ల చిన్న పిల్లలకు ఇది ఒక వ్యసనం మాదిరిగా తయారవుతుంది. ఇందులో ఎలాంటి పోషకాలు లేకపోయినా చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో అధికంగా పంచదార ఉండడం వల్ల వాటిని తినడానికి చిన్నపిల్లలు ఇష్టపడతారు. దాంతో బరువు పెరుగుతారు. అది ఆరోగ్యానికి చాలా హానికరం. Biscuits
Also Read: Dry Fruits: డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తింటున్నారా..అయితే ఈ విషయాలు తెలుసుకోండి?
బిస్కెట్లలో ఫైబర్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల పిల్లల్లో డయేరియా లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇందులో నీటి శాతం తక్కువగా ఉంటుంది. దానివల్ల డి హైడ్రేషన్ సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. బిస్కెట్లు తినడం వల్ల అందులో అధిక మోతాదులో మైదాపిండి ఉండడం వల్ల అది గుండె చుట్టూ పేరుకు పోతుంది. అంతేకాకుండా శరీరంలో కొవ్వును పెంచుతుంది. దానివల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. అది శరీరానికి అసలు మంచిదికాదు. అందువల్లనే చిన్న పిల్లలు, పెద్దవారు బిస్కెట్స్ తినకపోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Biscuits