Fennel Seeds: తిన్న తర్వాత వెంటనే సోంపు వేసుకుంటున్నారా…అయితే జాగ్రత్త ?
Fennel Seeds: సోంపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ప్రతిరోజు భోజనం చేసిన అనంతరం కొద్దిగా సోంపు నోటిలో వేసుకొని నమిలినట్లయితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. అంతే కాకుండా నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. ఉదయం పూట సోంపు గింజలు నోట్లో వేసుకుని నమిలినట్లయితే శరీరంలోని రోగనిరోధక శక్తి బలపడుతుంది.

health issues with Fennel Seeds
నేటి కాలంలో చాలామంది ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారు సోంపును తిన్నట్లయితే ఎముకలు బలంగా తయారవుతాయి. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది. సోంపులో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల శరీరంలో ఏర్పడే అనేక రకాల వ్యాధులను తొలగిస్తాయి. సోంపును తిన్నట్లయితే శరీరంలోని ఐరన్ శాతం పెరుగుతుంది. ఇది రక్తహీనత సమస్యలను నివారిస్తుంది. నేటి కాలంలో చాలామంది అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నారు.
అలాంటివారు సోంపు గింజలను తప్పకుండా తినాలి. దీనిని తిన్నట్లయితే సులభంగా బరువు తగ్గుతారు. పోట్ట, కొవ్వు తగ్గించుకోవాలని అనుకునేవారు రాత్రిపూట ఒక గ్లాసేడు నీటిలో ఒక చెంచాడు సోపు గింజలను వేసి నానబెట్టి ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో తాగినట్లయితే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. శరీరంలో మెటబాలిక్ రేటు పెరుగుతుంది. సోంపు ఎంతో సువాసనతో తినడానికి రుచిగా, తీపితో ఉంటుంది. సోంపు గింజలు తినడానికి ఇష్టపడేవారు దీనిని టీ రూపంలో తయారు చేసుకొని తాగాలి.
వేడి నీటిలో ఒక చెంచాడు సోంపు గింజలను వేసుకొని ఐదు నిమిషాల పాటు మరిగించి వడగట్టుకొని తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా జీర్ణ క్రియ సులభతరం అవుతుంది. ఇలా వేడి నీటిలో సోంపు గింజలను వేసుకొని తాగినట్లయితే బరువు కూడా సులభంగా తగ్గుతారు. ముఖ్యంగా సోంపును స్వీట్స్ తయారు చేసుకోవడంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది రుచిని అమాంతం పెంచుతుంది. ఏ రూపంలో అయినా సరే సోంపును తీసుకోవడం చాలా మంచిది.