Sugar: తీపి పదార్థాలు ఎక్కువగా తినే వారికి క్యాన్సర్‌ లాంటి వ్యాధులు వస్తాయా ?


Sugar: తీపి పదార్థాలు అంటే చాలామందికి ఇష్టమే. రోజువారి జీవన విధానంలో తీపి తినడం మనకు చాలావరకు బాగా అలవాటు అయిపోయింది. అందుకే ఆదిమ మానవుల దగ్గర నుంచి ఆధునిక మానవుల వరకు ప్రతి ఒక్కరూ తీపికి మంత్రముగ్ధులు అవుతారు. దీనికి కారణం వీటిలో ఎక్కువగా చక్కెర ఉంటుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందించడమే కాకుండా ఆనందాన్ని కూడా ఇవ్వడం దీని ప్రత్యేకత. చెక్కరి ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బంది.

Health Issues With Sugar

ఇది అతిగా తింటే అధికంగా బరువు, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడతారు. అలాగని అతి తక్కువగా తింటే మెదడు, మనసుకు సంబంధించిన రకరకాల సమస్యలు కూడా తలెత్తుతాయి. చెక్కరతో అంతా అనారోగ్యాలు సంభవిస్తాయి. తీపి పదార్థాలను దూరం పెట్టడం చాలా కష్టం. మత్తు పదార్థాల మాదిరిగానే చక్కెర కూడా మెదడులోని నాడి వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. నిజానికి చెక్కరను దాదాపు అన్ని ఇళ్లలో ఉపయోగిస్తారు. చక్కెర శరీరంలోకి అనేకరకాలుగా ప్రవేశిస్తుంది. కాఫీ, టీ తయారు చేయడం నుంచి స్వీట్లు తినడం వరకు చక్కెర ఎన్నో రకాలుగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది.

Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం ?

అయితే చక్కర ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పరిమిత పరిమాణంలో చక్కెర తినాలని సిఫార్సు చేస్తున్నారు. చక్కెరను వరుసగా 14 రోజులు పూర్తిగా మానేసినట్లయితే ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిజానికి చెక్కరను తినడం పూర్తిగా మానేస్తే మొదటి మూడు రోజుల్లో కడుపునొప్పి, అలసట, తలనొప్పి సమస్యలు ఏర్పడతాయి. ఆ తర్వాత చక్కర తినాలని కొంచెం కొంచెం కోరిక తగ్గుతుంది. నాలుగు నుంచి ఏడు రోజులు ఒంట్లో ఇలా చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రావడంతో శక్తివంతంగా ఉంటారు. చక్కర మానేసిన ఎనిమిదవ రోజు నుంచి పదవ రోజు వరకు జీవక్రియ మెరుగు పడుతుంది. మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. 10 రోజులు గడిచిన తర్వాత 11 నుంచి 14 రోజుల వరకు బాగా మారిపోవడం చేస్తారు. మునపటి కన్నా మెరుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *