Hero: గుడ్ న్యూస్..పెళ్ళై ఏడాది కాకముందే తండ్రి కాబోతున్న హీరో..?
Hero: తెలుగు ఇండస్ట్రీలో హీరో కిరణ్ అబ్బవరం అంటే తెలియని వారు ఉండరు. ఈ మధ్యకాలంలో మంచి డెప్త్ ఉన్న కథలతో మన ముందుకు వస్తు హిట్లు అందుకుంటున్నాడు. అలాంటి కిరణ్ అబ్బవరం గత ఏడాది ఆగస్టులో హీరోయిన్ రహస్య గోరకున్ వివాహం చేసుకున్నారు. అయితే ఈయన రాజా వారు రాణివారు అనే చిత్రంలో చేసే టైంలో హీరోయిన్ గా ఉండే రహస్య గోరక్ తో పరిచయం ఏర్పడింది.
Hero is going to become a father
అది కాస్త ప్రేమగా మారి చివరికి పెళ్లి వరకు వెళ్ళింది. ఇద్దరు పెద్దలని ఒప్పించి 2024 ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి ఎంజాయ్ చేస్తున్నటువంటి కిరణ్ అబ్బవరం తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ” మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అందరూ కిరణ్ కు కంగ్రాట్స్ చెబుతూ వస్తున్నారు. (Hero)
Also Read: Sai Pallavi: అవార్డు వస్తే నాకేంటి.. నాకు ఆ హీరో నచ్చలేదు.?
కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ 2019లో రాజావారు రాణివారు అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో చేసి హీరోగా నిలదొక్కుకున్నాడు. చివరికి 2024 లో “క” అనే చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకొని దాదాపు 50 కోట్ల వసూళ్లు సాధించాడు.
దీంతో ఈయన పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. వరుసగా ఆఫర్లు కూడా తన్నుకొస్తున్నాయి. ప్రస్తుతం ఈయన దిల్ రూబా చిత్రంలో చేస్తున్నారు.. ఈ మూవీ ప్రేమికుల దినోత్సవం రోజున విడుదల కానుంది. అలాంటి ఈ తరుణంలో ఈయన తన భార్య ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.(Hero)