Krishna: 60 వేల బికినీ కోసం కృష్ణతో హీరోయిన్ గొడవ.. ఏం జరిగిందంటే.?
Krishna: ఏంటి 60 వేల బికినీ కోసం సూపర్ స్టార్ కృష్ణతో హీరోయిన్ గొడవపడి షూటింగ్ సెట్ నుండి వెళ్లిపోయిందా.. ఇంతకీ కృష్ణతో గొడవ పెట్టుకున్న ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. కృష్ణతో గొడవ పెట్టుకొని షూటింగ్ నుండి వెళ్లిపోయిన హీరోయిన్ ఎవరో కాదు నగ్మా..ఒకప్పుడు సౌత్ నార్త్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో నగ్మా పేరు కూడా ఉంటుంది.

Heroine fight with Krishna for bikini
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కృష్ణతో కలిసి భరత సింహం అనే మూవీలో నటించింది. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ గా సాగర్ నిర్మాతగా రామ ఎల్వి రామరాజులు చేశారు. అయితే ప్రతి సినిమాకి హీరో హీరోయిన్లు అందులో చేసే ప్రతి ఒక ఆర్టిస్టు వేసుకునే క్యాస్ట్యూమ్స్ కి సంబంధించి చిత్ర యూనిట్ బట్టలు తీసుకొస్తూ ఉంటుంది.(Krishna)
Also Read: Posani Krishna Murali: అమ్మాయితో రవితేజ తమ్ముడు నా రూమ్ లో రహస్యంగా ఎఫైర్ నడిపించి.?
కానీ ఆ షూటింగ్లో మాత్రం నిర్మాత ఎల్వి రామరాజు నగ్మా నే బట్టలు తెచ్చుకొమ్మను మనం వాటికి డబ్బులు పే చేద్దాం అని చెప్పారట. దాంతో డైరెక్టర్ సాగర్ ఈ విషయాన్ని నగ్మా కు చెప్పగా ఓ సీన్ కోసం బికినీ తెచ్చుకుందట.2 బికినీలకు 60000 వేల రూపాయలు అని చెప్పడంతో షాక్ అయిపోయిన నిర్మాత, డైరెక్టర్ చిన్న బికినీకి 60 వేలా.. ఇది ఎవరికైనా చెప్పిన నమ్మేటట్లు ఉందా.. ఈ డబ్బులు మేము ఇవ్వమని డైరెక్టర్ నిర్మాత అన్నారట.

దాంతో నగ్మా అస్సలు తగ్గకుండా డబ్బులు ఇవ్వాల్సిందే అని బెట్టు చేసిందట. కానీ డైరెక్టర్ నిర్మాత ఇద్దరూ ఫైర్ అవ్వడంతో నగ్మా షూటింగ్లోనే ఏడ్చిందట. ఆ తర్వాత కృష్ణ ఎంత చెప్పినా కూడా వినకుండా కృష్ణతో కూడా గొడవ పెట్టుకొని షూటింగ్ నుండి వెళ్లిపోయిందట. ఆ తర్వాత ఎవరు సర్ది చెప్పినా కూడా షూటింగ్ కి రాకపోవడంతో చివరికి కొద్ది మేర షూటింగ్ హీరోయిన్ లేకుండానే సినిమాకి ఎండ్ కార్డు పెట్టేసారు. అయితే నగ్మా చేసిన ఈ గొడవ గురించి డైరెక్టర్ సాగర్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.(Krishna)