Allu Arjun: అర్జున్ ని వెర్రి వెంగళప్పని చేసిన హీరోయిన్.. నెట్టింట్లో ట్రోల్స్.?
Allu Arjun: అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో చాలా రోజుల నుండి టోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప-2 సినిమా తర్వాత బన్నీని విమర్శించని వాళ్ళు ఉండరు. అయితే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని ఓ సీన్ ని వైరల్ చేస్తూ అల్లు అర్జున్ ని వెర్రి వెంగళప్పని చేసింది ఆ హీరోయిన్ అంటూ మరోసారి అల్లు అర్జున్ పై ట్రోల్స్ వస్తున్నాయి.మరి ఇంతకీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అల్లు అర్జున్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం.

Heroine insult Allu Arjun
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేష్ స్టేజ్ పై నృత్యం చేశాక ఎమ్మెల్యే ఐశ్వర్య రాజేష్ పర్ఫామెన్స్ మెచ్చి అవార్డు ఇవ్వడానికి స్టేజ్ మీదకి చాలా ఆసక్తిగా వెళ్తాడు.కానీ అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే తో అవార్డు అందుకోవడం ఇష్టం లేని ఐశ్వర్య రాజేష్ తన భర్తతో శాలువా కప్పించుకొని అవార్డు తీసుకోవాలని అనుకుంటుంది.(Allu Arjun)
Also Read: Nagarjuna: నాగార్జున ఆ పార్ట్ టచ్ చేస్తాడని బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్.?
ఇక ఆమె అనుకున్నట్లుగానే వెంకటేష్ తో అవార్డు అందుకుంటుంది.అయితే ఈ సీన్ అచ్చం నయనతార గతంలో అల్లు అర్జున్తో అవార్డు అందుకోవడం ఇష్టం లేక తన భర్త విఘ్నేష్ తో అందుకోవాలని చెబుతుంది. అలా ఆరోజు స్టేజ్ మీదికి వచ్చిన అల్లు అర్జున్ కి నయనతార ఓ రకంగా అవమానించిందని చెప్పుకోవచ్చు.

ఓ అవార్డ్ ఫంక్షన్ లో నయనతార కి అల్లు అర్జున్ అవార్డు ఇవ్వడానికి వెళ్తారు. కానీ విగ్నేష్ శివన్ తో తీసుకోవాలని ఉంది అని చెప్పడంతో అల్లు అర్జున్ కాస్త హర్ట్ అవుతారు. అయితే ఆ వీడియోని అనుసరించే సంక్రాంతి వస్తున్నాం సినిమాలో ఆ సీన్ పెట్టారంటూ అల్లు అర్జున్ ని నయనతార ఆ రోజు వెర్రి వెంగళప్పని చేసింది అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.(Allu Arjun)