Heroine: డైరెక్టర్ మీద ఇష్టం.. చేయి కోసుకుంటానంటున్న హీరోయిన్.?
Heroine: చాలామంది సెలబ్రిటీలకు ఎవరో ఒకరి మీద క్రష్ ఉంటుంది.అయితే అది ప్రేమే అని కాదు.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కి కూడా ఒక డైరెక్టర్ అంటే పిచ్చి ఇష్టమట. ఆ డైరెక్టర్ కోసం చెయ్యి అయినా కోసుకుంటానంటోంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు ఆ డైరెక్టర్ అంటే అంత ఇష్టం అనేది ఇప్పుడు చూద్దాం. హీరోయిన్ ప్రియమణి అంటే పరిచయాలు అక్కర్లేని పేరు.ఈమె దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
Heroine intersting comments on that director
ఇక సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు తగ్గాక కూడా తల్లి అత్త పాత్రలో నటిస్తూ కీరోల్స్ పోషిస్తుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ డైరెక్టర్ పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది. ఇక ఆ డైరెక్టర్ ఎవరంటే మణిరత్నం.. మణిరత్నం సినిమాలో చేయాలి అని ప్రతి ఒక్క హీరో హీరోయిన్ కి ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాలు అన్నీ అంత అద్భుతంగా ఉంటాయి. ఎంతో అద్భుతంగా సినిమాలు తెరకెక్కించే మణిరత్నం డైరెక్షన్లో ఒక్కసారైనా ఛాన్స్ రావాలి అని కోరుకునే హీరో హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు.(Heroine)
Also Read: Kollywood: వెయ్యి కోట్లు కొట్టడం కోలీవుడ్ కి కలేనా?
అయితే అలాంటి వారిలో హీరోయిన్ ప్రియమణి కూడా ఒకరు.. ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మణిరత్నం సార్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం.. ఆయన సినిమాలో అవకాశం కోసం చూస్తున్నాను. ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే నేను అదే పెద్ద అదృష్టంగా భావిస్తాను.అంతేకాదు ఆయన నుండి నాకు ఫోన్ వస్తే చేయి కోసుకోమన్నా కోసుకుంటాను అంత ఇష్టం ఆయన డైరెక్షన్ అంటే.. అలాగే ఆయన సినిమాలు నేను చాలా చూశాను.
ఆయన సినిమాలు చూసి ఒకవేళ ఆయన నాకు సినిమాల్లో అవకాశం ఇస్తే అది ఏ పాత్ర అయినా సరే అందులో నటించడానికి ఓకే చెబుతాను అంటూ మణిరత్నం మీద ఉన్న ఇష్టాన్ని బయటపెట్టింది ప్రియమణి. ఇక ప్రియమణి పర్సనల్ లైఫ్ కి వస్తే..ఈమె రెండో పెళ్లి వాడైనా ముస్తఫా రాజ్ ని పెళ్లాడింది. అయితే ఇప్పటివరకు వీరికి పిల్లలు అయితే లేరు.(Heroine)