Laila: కొడుకుని పట్టుకొని కొత్త బాయ్ ఫ్రెండ్ అంటూ లైలాకి అవమానం.?
Laila: ఒకప్పుడు ఇండస్ట్రీలో తన అంత చందాలతో ఊపు ఊపిన హీరోయిన్లలో లైలా మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు.. సొట్ట బుగ్గలతో అప్పటి కుర్ర కారును సొల్లు కార్చుకునేలా చేసేది. అలాంటి లైలా సినిమా థియేటర్లోకి వస్తుంది అంటే తప్పకుండా ఆ థియేటర్ హౌస్ ఫుల్ అయ్యేది. ఆ విధంగా 1996 నుంచి 2006 వరకు వరుస చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది లైలా.

Heroine Laila intresting comments
అలాంటి లైలా కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే ఒక ఇరానియన్ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అలాంటి ఈమె దాదాపు రెండు దశాబ్దాలు దాటిన తర్వాత మళ్లీ తెలుగు ఆడియన్స్ ను పలకరించడం కోసం “శబ్దం” అనే చిత్రం ద్వారా రాబోతోంది.. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలన్నింటిని బయటపెట్టింది.. (Laila)
Also Read: SSMB29 Movie: రాజమౌళి మహేష్ చిత్రం అప్డేట్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!!
అయితే లైలా ఇండస్ట్రీకి దూరమై 20 ఏళ్లు గడిచిన కానీ ఆమె అందంలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇంకా అప్పటి లైలా గానే కనిపిస్తోంది.. లైలాకు ఇద్దరు పిల్లలు ఒకరు 18 ఏళ్లు, మరొకరు 14 ఏళ్ళు ఉంటారని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే లైలా తన చిన్న కొడుకుతో ఎప్పుడైనా బయటకు వెళ్తే మీ బాయ్ ఫ్రెండా అని అడుగుతారట.. తన చిన్న కొడుకు 6.3 అడుగుల ఎత్తు ఉంటాడని చెప్పింది..

అంతే కాదు లైలా కూడా యంగ్ గానే కనిపించడంతో ఆ అబ్బాయితో బయటకు వెళ్లినప్పుడల్లా గర్ల్ ఫ్రెండా అని చాలామంది అడుగుతారని, నేను కూడా ఫన్నీగా వాళ్లకి నా బాయ్ ఫ్రెండ్ అంటూ ఫ్రాంక్ చేస్తానని చెప్పుకొచ్చింది.. నేనే కాదు నా భర్త కూడా చాలా యంగ్ గానే కనిపిస్తారని మేమిద్దరం డైట్ పాటిస్తూ ఈ విధంగా ఫిట్నెస్ మెంటైన్ చేస్తున్నామని అన్నది.. ఇక లైలా అప్పట్లో నటించిన సినిమాల్లో పెళ్లి చేసుకుందాం, ఎగిరే పావురమా, ఖైదీ గారు, పవిత్ర ప్రేమ, ఉగాది, లవ్ స్టోరీ 1999, శుభలేఖలు, నా హృదయంలో నిద్రించే చెలి, అనే చిత్రాల్లో నటించి అద్భుత గుర్తింపు తెచ్చుకుంది.(Laila)