Balakrishna: పదో తరగతి పరీక్షలు రాస్తూ బాలయ్యతో రొమాన్స్ కోసం ఈ హీరోయిన్ ఏం చేసిందో తెలిస్తే షాకే.?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ కోసం చాలామంది హీరోయిన్లు వెయిట్ చేస్తూ ఉంటారు. అలా ఓ హీరోయిన్ కూడా పదో తరగతి ఎగ్జామ్స్ రాస్తూ బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ కొట్టేయాలని చూసిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. పదో తరగతి ఎగ్జామ్స్ రాసిన సమయంలోనే సినిమాల్లోకి వచ్చిందా అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది హీరోయిన్లు చిన్న వయసులోనే సినిమాల మీద మోజుతో ఇండస్ట్రీలోకి వస్తున్నారు.
Heroine Romance with Balakrishna while writing tenth grade exams
అలా ఇప్పటి జనరేషన్ వాళ్లే కాదు ఎప్పటినుండో ఇండస్ట్రీ లోకి హీరోయిన్లు చిన్న ఏజ్ లోనే ఎంట్రీ ఇస్తున్నారు.అయితే బాలకృష్ణ సినీ కెరియర్ లో ది బెస్ట్ మూవీ అయినటువంటి ఆదిత్య 369 మూవీలో హీరోయిన్గా ఎవరిని తీసుకుందాం అని అనుకున్న సమయంలో చాలామంది హీరోయిన్ల పేర్లు తెరమీదకి వచ్చాయట. అలా మొదట విజయశాంతిని అనుకున్నప్పటికీ ఇప్పటికే బాలకృష్ణ విజయశాంతి కాంబోలో ఎక్కువ సినిమాలు వచ్చాయని,ఆ హీరోని పక్కన పెట్టారట.(Balakrishna)
Also Read: Tabu: బాలీవుడ్ నిర్మాతతో టబు ఎంగేజ్మెంట్..?
ఆ తర్వాత బాలీవుడ్ నటి ఊర్మిళా మందోడ్కార్ ని అనుకున్నప్పటికీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఊర్మిళ కూడా ఆ సినిమా నుండి తప్పుకుందట. ఆ తర్వాత ఏం చేయాలి ఏ హీరోయిన్ ని పెట్టుకోవాలి అని డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఆలోచనలో పడ్డ సమయంలో హీరోయిన్ దివ్యభారతిని సెట్ చేశారట.ఇక అదే టైంలో దివ్యభారతి కొన్ని సినిమాల్లో చేస్తూనే ఓవైపు పదో తరగతి పరీక్షలు రాస్తుందట.

అయితే ఎగ్జామ్స్ ఉన్నా సరే ఎగ్జామ్స్ పూర్తి చేసి ఈ సినిమాలో నటిస్తాను అని దివ్యభారతి చెప్పిందట.కానీ అప్పటికే సమయం ఎక్కువైపోతుంది అని సింగీతం శ్రీనివాసరావు దివ్యభారతి ని కూడా పక్కనపెట్టి చివరికి నటి మోహిని ని ఈ సినిమాలో హీరోయిన్గా సెట్ చేశారు. అలా పదో తరగతి ఎగ్జామ్స్ రాస్తూనే దివ్యభారతి బాలకృష్ణ సినిమాలో నటించాలనుకుంది. కానీ ఎగ్జామ్స్ అయిపోయే వరకు లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో డైరెక్టర్ దివ్యభారతిని తీసుకోలేదట.(Balakrishna)