Akhil: అఖిల్ పై మోజు.. పెళ్లి అవ్వకుంటే బాగుండు..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.?
Akhil: తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు అఖిల్. ఇప్పటికీ ఎన్నో సినిమాలు చేసినా కానీ సరైన గుర్తింపు మాత్రం లభించలేదు. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న అఖిల్ ఒక అద్భుతమైన హిట్ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అలాంటి అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా ద్వారా మాత్రమే ఓ మోస్తారు హిట్ అందుకొని కాస్త పేరు తెచ్చుకున్నారు
Heroine shocking comments on Akhil
కానీ ఆ సినిమా అఖిల్ వల్ల హిట్ అవ్వలేదని హీరోయిన్ పూజా హెగ్డే వల్ల హిట్ అయిందని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి.. అలా అఖిల్ మంచి బాడీ సౌష్టవం, హ్యాండ్సమ్ గా ఉన్నా కానీ హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోతున్నారు.. అలాంటి యంగ్ హీరో అఖిల్ ను ఒక పెళ్లయిన హీరోయిన్ ఎంతగానో ఇష్టపడుతుందట. ఆయనను పెళ్లి కూడా చేసుకోవడానికి రెడీ అవుతుందట.. మరి ఆమె ఎవరు? ఆ వివరాలు ఏంటో చూద్దాం..(Akhil)
Also Read: Game Changer: అమెరికాలో భారీగా ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్.. పుష్ప స్ట్రాటజీ!!
ఇట్లు మారేడుపల్లి ప్రజానికం, జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాలు అందరికీ తెలిసినవే. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ఆనంది అంటే కూడా అందరికీ పరిచయమే..అలాంటి ఈమె తెలుగులో ఈ సినిమాలు చేసి కోలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయి అక్కడ అద్భుతమైన హిట్లు సాధిస్తోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ పై మోజు పడిందట..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అఖిల్ పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది.. అఖిల్ అందాన్ని చూస్తుంటే నేను ఇంత తొందరగా పెళ్లి ఎందుకు చేసుకున్నాను రా దేవుడా అని అనిపిస్తుందని చెప్పింది.. ప్రస్తుతం ఆనందికి పెళ్లయిపోయి ఒక బేబీ కూడా ఉంది. ఈ తరుణంలో ఆమె ఈ కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.(Akhil)