ANR: 60 ఏళ్ల వయసులో ఏఎన్ఆర్ సరసం.. నా నడుము పట్టుకొని అలా చేశారంటూ హీరోయిన్ కామెంట్స్..!!
ANR: ఒక ఇల్లు గట్టిగా నిలబడాలంటే దానికి ఉండే పిల్లర్లు స్ట్రాంగ్ గా ఉండాలి.. ఒక కుటుంబం ఎదగాలి అంటే ఇంట్లో ఇల్లాలు భర్త స్ట్రాంగ్ గా ఉండాలి.. అలాగే ఒక వ్యవస్థ బాగుపడాలంటే రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు, విద్యావేత్తలు స్ట్రాంగ్ గా ఉండాలి.. అదే ఒక సినిమా ఇండస్ట్రీ బాగుపడాలంటే అందులో నటించే నటీనటులు, దర్శక, నిర్మాతలు బాగుండాలి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉంది అంటే దానికి ప్రధాన కారకులు ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పవచ్చు..

Heroine Shocking comments on ANR
వీళ్ళు ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా ఎదిగేలా చేశారు. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ అయితే సినిమాల విషయంలో పోటీపడి మరీ నటించేవారు. ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలు చేస్తుంటే ఏఎన్ఆర్ మాత్రం చాలా రొమాంటిక్ సినిమాలు చేస్తూ రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.. అలాంటి ఆయన ముసలి వయసులో కూడా యంగ్ హీరోయిన్లపై కామెంట్లు చేసేవారట.. (ANR)
Also Read: Nagarjuna: ఆపరేషన్ థియేటర్లో ఏఎన్ఆర్.. గుడిలో నాగార్జున చేసిన పనికి ఏఎన్ఆర్ కన్నీళ్లు.?
చింత చచ్చినా పులుపు చావదు అన్నట్టు ఏఎన్ఆర్ ఏ వయసులో ఉన్నా కానీ హీరో గానే బిహేవ్ చేసేవారట.. ఈ విషయాన్ని తనతో నటించి ఆడి పాడినటువంటి హీరోయిన్ జయమాలిని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈమె ఎక్కువగా ఐటెం సాంగ్స్ లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో 600కు పైగా చిత్రాల్లో నటించిందట.

తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏఎన్ఆర్ తన నడుమును చూసి తరచూ కామెంట్స్ చేసే వారిని చెప్పుకొచ్చింది. తనను ఒక హీరోయిన్ లా చూడకుండా తన మరదలిలా చూసే వారని సరదాగా చెప్పుకొచ్చింది.. ఏఎన్ఆర్ ఎంత వయసు వచ్చినా 25 ఏళ్ల యువకుడిలా ఉండేవారని నాతో ముసలి వయసులో కూడా సరసం ఆడేవారని అన్నది. ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ANR)