Heroine: రెండేళ్లలో 3000 కోట్లు..అద్దె ఇంట్లో అమ్మానాన్న.. హీరోయిన్ కన్నీటి కష్టాలు.?

Heroine: ఈ హీరోయిన్ గత రెండేళ్లలో ఏకంగా మూడు వేల కోట్లు కలెక్షన్స్ సాధించిన సినిమాలో భాగమైంది.. ఎన్నో సంచలనాలు సృష్టించి నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. కానీ అలాంటి ఈ హీరోయిన్ తల్లిదండ్రులు అద్దె ఇంట్లో ఉండి ఎన్నో బాధలు అనుభవించారట. ఇక నేషనల్ క్రష్ అనగానే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ హీరోయిన్ ఎవరో.. ఆమెనే రష్మిక మందన్నా.. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లోకి వచ్చిన రష్మిక మందన్నా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది.
Heroine tearful hardships
ఆ తర్వాత వచ్చిన యానిమల్ మూవీ తో రష్మిక పేరు బాలీవుడ్ లో మార్మోగిపోయింది. అలాగే గత ఏడాది విడుదలై ఇండస్ట్రీలో రచ్చ సృష్టించిన పుష్పటులో శ్రీవల్లి పాత్రలో రష్మిక చేసిన యాక్టింగ్ కి ఎంతోమంది ఫిదా అయ్యారు. ప్రస్తుతం రష్మిక సల్మాన్ ఖాన్ తో సికిందర్ మూవీలో అలాగే సౌత్ లో ధనుష్ తో కుబేర మూవీలో కూడా చేస్తుంది. ఈ సినిమా కూడా విడుదలకు రెడీగా ఉంది. (Heroine)
Also Read: Heroine: ఆ రాజకీయ నాయకుడిపై బాలీవుడ్ హీరోయిన్ మోజు.. ఒక రాత్రి డేట్ చేయాలంటూ.?
అయితే ప్రస్తుతం అయితే ఎన్నో కోట్లు సంపాదించి ఒక్కో సినిమాకి 7 నుండి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న రష్మిక ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో ఇబ్బందులు అనుభవించిందట.ముఖ్యంగా రెంట్ కట్టలేని పరిస్థితిలో అద్దె ఇళ్లలో ఎన్నో రోజులు ఇబ్బందులు పడ్డారట రష్మిక పేరెంట్స్.. చిన్నతనం నుండి హీరోయిన్ అయ్యేవరకు అద్దె ఇంట్లో ఉంటూ ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్న రష్మిక మందన్నా తన పేరెంట్స్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంత కృంగిపోతున్నారో దగ్గరుండి చూసిందట.

రష్మిక తల్లిదండ్రులు కష్టపడడం చూసి మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి చివరికి హీరోయిన్గా నిలదొక్కుకుంది. అలా కన్నడాలో కిరిక్ పార్టీ మూవీ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం సౌత్ నార్త్ ఇండస్ట్రీని షేక్ చేసే స్టేజ్ కి వచ్చింది.అలా సినిమాల్లోకి రాకముందు అందరిలాగే నేను కూడా ఎన్నో కష్టాలు అనుభవించాను అంటూ రష్మిక ఆ ఇంటర్వ్యూలో ఓపెన్ గానే ఈ విషయాన్ని బయటపెట్టింది.(Heroine)