Heroine: రెండోసారి తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్..?
Heroine: ఒకప్పుడు టాలీవుడ్ లో యూత్ కు ఎంతో క్రేజ్ అందించిన హీరోయిన్స్ లో ఇలియానా కూడా ఒకరు. ఇలియానా హీరోయిన్ గా సినిమాల్లో వస్తుంది అంటే యువత థియేటర్లకు పరుగులు తీసేవారు. ఆ విధంగా అందచందాలతో అద్భుతమైన గుర్తింపు పొందిన ఇలియానా తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా మరో కొత్త విషయాన్ని బయట పెట్టింది.. అంటే ఆమె అధికారికంగా బయట పెట్టలేదు కానీ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఆమె పోస్ట్ చేసిన వీడియో ద్వారా ఈ విషయం బయటపడింది.
Heroine who is going to be a mother for the second time
ఇంతకీ ఆ విషయం ఏంటయ్యా అంటే ఆమె రెండవసారి ప్రెగ్నెంట్ అవ్వడం.. ఆ వివరాలు ఏంటో చూద్దామా.. గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. మంచి పొజిషన్ లో ఉండగానే ఇండస్ట్రీకి దూరమై ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ మైకేల్ డోలాన్ తో కలిసి ప్రెగ్నెంట్ అయింది. తనకు కొడుకు పుట్టిన తర్వాతే ఆమె వివాహం చేసుకుంది. అలా మొదటి సంతానంతో ఎంజాయ్ చేస్తున్న ఇలియానా 2024లో బాలీవుడ్ లోని పలు చిత్రాల్లో నటించింది.(Heroine)
Also Read: Balakrishna: రష్మిక పెళ్లి ఎప్పుడో లీక్ చేసిన బాలకృష్ణ..?
ఆ తర్వాత కొన్నాళ్ల నుంచి ఇండస్ట్రీకి మళ్లీ దూరమైంది. అలాంటి ఇలియానా తాజాగా జనవరి 1 సందర్భంగా మరోసారి ప్రెగ్నెంట్ అయినట్టు తెలుస్తోంది. అయితే న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ప్రేమ, శాంతి, దయ, 2025లో అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అంటూ క్యాప్షన్ పెడుతూ ఆ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తాను 2024 లో ఏ విధంగా గడిచిందో మొత్తం జనవరి నుంచి డిసెంబర్ వరకు వీడియో ద్వారా చూపించింది.
ఇందులో అక్టోబర్ నెల వచ్చేసరికి ఇలియానా ప్రెగ్నెంట్ కిట్ చూపించింది. దీన్ని చూసిన నెటిజన్స్ ఇలియానా మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి నిజంగానే ప్రెగ్నెంట్ అయిందా.? లేదంటే పాత ఫోటోనే ఆ వీడియోలో ఆడ్ చేసిందా అనేది ముందు ముందు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇల్లీ బేబీ మరోసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.(Heroine)