Heroine: రహస్యంగా డైరెక్టర్ ని పెళ్లాడిన నాగార్జున హీరోయిన్.?
Heroine: ఏంటి ఈ నాగార్జున హీరోయిన్ నిజంగానే పెళ్లి చేసుకుందా.. ఆ డైరెక్టర్ తో హీరోయిన్ పెళ్లి వార్తలు నిజమేనా..అంత రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే పూనమ్ బజ్వా.. పూనమ్ బజ్వా అనే పేరు చెప్పగానే చాలామందికి మొదటి సినిమా గుర్తుకొస్తుంది.నవదీప్ హీరోగా చేసిన మొదటి సినిమా అనే టైటిల్ తో వచ్చిన మూవీలో పూనమ్ బజ్వా నటించింది.

Heroine who secretly married the director
ఆ తర్వాత పరుగు సినిమా అలాగే నాగార్జున బాస్ సినిమాలో కూడా నటించింది.అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు తక్కువగానే చేసినప్పటికీ కన్నడ, తమిళ,మలయాళ భాషల్లో మాత్రం బాగా ఫేమస్ అయింది. ఇక పూనమ్ బజ్వా తెలుగులో నటించిన చివరి చిత్రం కథనాయకుడు.. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ చాలా రోజుల నుండి సినిమాలకు దూరంగా ఉంటుంది..(Heroine)
Also Read: Yash: యష్ రాధికల మధ్య విభేదాలు.. 10 రోజులైనా ఇంటికి వెళ్లకుండా షూటింగ్లోనే..?
ఇక సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. రీసెంట్ గానే కుంభమేళలో పుణ్య స్నానం కూడా ఆచరించింది. ఇక ఈ ముద్దుగుమ్మ తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అయితే చాలా రోజుల నుండి ఈ హీరోయిన్ మీద ఒక రూమర్ వినిపిస్తోంది.

అదేంటంటే ప్రముఖ డైరెక్టర్ సునీల్ రెడ్డిని పూనమ్ బజ్వా రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ రూమర్లు వినిపిస్తున్నాయి.అయితే ఇప్పటివరకు ఈ రూమర్ పై పూనమ్ బజ్వా స్పందించకపోయినప్పటికీ నిజంగానే ఈ హీరోయిన్ డైరెక్టర్ని పెళ్లి చేసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈ రహస్య పెళ్లి వార్తలపై పూనమ్ బజ్వా స్పందిస్తే గాని తెలియదు.(Heroine)