Chiranjeevi:చిరంజీవి తో రొమాన్స్.. షూటింగ్ లో కొట్టుకున్న ఇద్దరు హీరోయిన్లు.?
Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి.. అలా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉండేవారు. ఆ తర్వాత తరంలో వచ్చిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇక ఈయన తర్వాత వచ్చిన మరోతరం హీరోలలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు..

Heroines beating because Chiranjeevi
ఇలా ఇండస్ట్రీలో సంవత్సరాలు గడిచే కొద్దీ కొంతమంది హీరోల పేర్లు చాలా పాపులర్ అవుతూ ఉంటాయి.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు చిరంజీవి.. ఇప్పటికి ఏడు పదుల వయసు దగ్గరికి వస్తున్నా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన పుస్తకాన్ని రాసుకున్నారు. అలాంటి చిరంజీవి మంచి ఏజ్ లో ఉన్నప్పుడు చాలా సినిమాల్లో నటించారు. (Chiranjeevi)
Also Read: Chiranjeevi: లైవ్ లోనే కొట్టుకున్న చిరు రాజశేఖర్.. భయపడేది లేదన్న చిరు.!
అయితే ఈయన ఎక్కువగా రాధా, విజయశాంతిలతో సినిమాలు చేశారు.. ఇక రాధ డాన్స్ పరంగా అద్భుతమని చెప్పవచ్చు. ఇక విజయశాంతి నటనపరంగా మహా అద్భుతమని చెప్పవచ్చు. ఇక ఇద్దరు చిరంజీవితో పోటీపడి నటించేవారు.. ఒక్కోసారి చిరంజీవితో నేను చేస్తానంటే, నేను చేస్తానని అనుకునే వారట. దర్శక నిర్మాతలు ఇద్దరినీ సమానంగా చూస్తూ చిరంజీవితో నటించడానికి ఆఫర్లు ఇచ్చేవారు.

ముఖ్యంగా రాధా డేట్స్ ఖాళీగా లేకుంటే విజయశాంతితో, ఈమె డేట్స్ ఖాళీగా లేకపోతే రాధతో సినిమా తీసేవారు.. ఈ విధంగా రాధా విజయశాంతి మధ్య అప్పట్లో ఓ యుద్ధమే జరిగేదని చెప్పవచ్చు. అంతేకాదు ఒకానొక సమయంలో వీరిద్దరూ చిరంజీవి కోసం గొడవ కూడా పెట్టుకున్నట్టు వార్తలు వినిపించాయి.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు చిరంజీవియా మజాకా అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Chiranjeevi)