Pushpa 2 Songs: హిందీలో కాకరేపుతున్న కిసిక్ పాట.. భారీ ఓపెనింగ్స్ ఖాయమేనా?
Pushpa 2 Songs: ‘పుష్ప: ది రూల్’ సినిమా పాటలు మొదటిగా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకగా అనేక విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అవి సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా ‘ఊ అంటావా’ పాటకు భారీ ఫాలోయింగ్ పెరిగింది. ఇక తాజాగా పుష్ప 2 లోని ‘కిసిక్’ సాంగ్ రిలీజ్ కాగా ఇది తెలుగులో పెద్దగా వైరల్ కాలేదు. కానీ, హిందీ వెర్షన్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Hindi Audiences Are Loving Pushpa 2 Songs
‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని ‘ఊ అంటావా’ పాట కూడా మొదటిసారి విన్నప్పుడు నెగెటివ్ గా రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత అది క్రమంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం వేరే లెవెల్ లో హిట్టయింది. ‘కిసిక్’ సాంగ్ కూడా అలాగే ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని చిత్రబృందం నమ్మకంతో ఉంది.
Also Read: Chiranjeevi: ఆ స్టార్ దర్శకుడిని దారుణంగా అవమానించిన చిరంజీవి!!
అయితే, ఈ సాంగ్ హిందీ వెర్షన్‌లోని ‘తప్పడ్ మారుంది సాలా’ అనే లిరిక్స్, హిందీ ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించాయి. ఈ లిరిక్స్, దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన బీట్స్‌తో మిళితమై, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందీ ప్రేక్షకులు ఈ పాటను రీల్స్, ట్రెండింగ్ వీడియోలుగా చేసి వైరల్ చేస్తున్నారు.దాంతో ‘పుష్ప’ సినిమా హిందీ వెర్షన్ పై ఇప్పుడు అంచనాలు గట్టిగా ఉన్నాయి. హిందీ ఆడియన్స్‌కు సినిమాను ఎక్కువగా ఆదరించడం ఖాయంగా తెలుస్తుంది. పుష్ప సినిమాలోని మేనరిజమ్స్, పాటలు వారిని మరీ ముఖ్యంగా ఆకట్టుకున్నాయి.
తెలుగు చిత్రాలను హిందీ ప్రేక్షకులు ఈ మధ్య విస్తృతంగా ఆదరిస్తుండగా ‘పుష్ప 2’కు కూడా తప్పకుండా వారి లిస్ట్ లో ఉన్నదని భావిస్తున్నారు. ఇక, బాలీవుడ్‌లో ఇలాంటి మాస్ పాటలు అరుదుగా ఉంటాయి, కాబట్టి ఈ పాట మరింత ప్రశంసలు అందుకుంటోంది. ‘తప్పడ్ మారుంది సాలా’ పాటకు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వచ్చింది, దీనితో ‘పుష్ప 2’పై హిందీ ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది.