HMPV: ఈ లక్షణాలు ఉంటె కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లాల్సిందే ?
HMPV: చైనాను గజగజ వణికిస్తున్న ప్రాణాంతకమైన హెచ్ఎంపిబి వైరస్ భారత దేశంలోకి ప్రవేశించింది. ఏదైతే జరగకూడదు అని అందరూ అనుకున్నారు అదే జరిగింది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఓ చిన్నారికి ఈ వైరస్ సోకినట్లుగా వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది నెలల పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
HMPV symtoms and cares
దీంతో దేశ ప్రజలు ముఖ్యంగా కర్ణాటక పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రాలు భయాందోళనకు గురి అవుతున్నాయి. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు జారీ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కర్ణాటక ప్రభుత్వం హెచ్ఎంపివి వైరస్ కేసు నమోదు అయినట్లు అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కాగా, అసలు ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే…. పిల్లలలో ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలో తెలుసుకుందాం….
ఈ వైరస్ బారిన పడిన పిల్లలకు ఎక్కువగా జ్వరం ముక్కుదిబ్బడ, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లక్షణాలు కనిపిస్తాయట. అలాగే ఈ హెచ్ఎంపివి వైరస్ బారిన పడిన పిల్లలు న్యూమోనియా, బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉందట. అందుకే తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. అలాగే బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా వాడాలి. సానిటైజర్ వాడడం వంటివంటివి చేయాలి. అంతేకాకుండా అవసరమైతే తప్ప పిల్లలను బయటకు తీసుకు రాకూడదు.