Honey Rose: తమిళ హీరోతో హనీ రోజ్ పెళ్లి.. ఓకే ఫ్లాట్లో సహజీవనం.?

Honey Rose: గత పదేళ్ల ముందే తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్ అప్పట్లో ఎవరికి తెలియదు. ఎప్పుడైతే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించినప్పటి నుండి హనీ రోజ్ కి అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. అంతేకాదు వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ అందాలకు చాలామంది ఫిదా అయ్యారు. ఆమె భారీ అందాలకు ఫిదా అయిన కుర్ర కారు సోషల్ మీడియాలో హనీ రోజ్ ని తెగ ఫేమస్ చేసేసారు.దాంతో హనీ రోజ్ కి వరుసగా ఆఫర్స్ వచ్చాయి.
Honey Rose marriage to a Tamil hero
అలా లేడీ ఓరియెంటెడ్ మూవీలతో పాటు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి పిలుస్తూ హనీ రోజ్ ని పాపులర్ చేసేసారు. అలా హనీ రోజ్ అటు షాపు ఓపెనింగ్స్ తో ఇటు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలో ఓ హీరోతో హనీ రోజ్ ప్రేమలో పడిపోయింది అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్ ని అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు.(Honey Rose)
Also Read: Nithiin: ఆ యాంకర్ తో నితిన్ రొమాన్స్.. కానీ చివరికి.?
ఇప్పుడైతే ఫేమస్ అయిపోయింది. అయితే టాలీవుడ్ నుండి వచ్చాక కోలీవుడ్,కన్నడ వంటి కొన్ని సినిమాల్లో చేసిందట.అలా కోలీవుడ్ లో కూడా పరిచయం ఉన్న హాని రోజ్ తమిళ హీరోతో ప్రేమలో పడిపోయిందట. ఆ తమిళ హీరోతో హనీ రోజ్ ఓకే ఫ్లాట్ లో ఉంటూ సహజీవనం చేస్తున్నట్టు కూడా కోలీవుడ్ మీడియా మొత్తం కోడై కూస్తుంది. దీంతో హనీ రోజ్ మ్యాటర్ కాస్త మీడియాలో వైరల్ అయ్యేసరికి హనీ రోజ్ ప్రేమలో పడిపోయిన కోలీవుడ్ హీరో ఎవరబ్బా అని తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్స్.

అయితే పేరు బయటికి రాకపోయినప్పటికీ హనీ రోజ్ మాత్రం ఆ తమిళ హీరోతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది అని మాత్రం వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా హనీ రోజ్ షాపు ఓపెనింగ్ కి పిలిచిన బిజినెస్ మాన్ లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఒక సంచలన పోస్ట్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇక హనీ రోజ్ పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో హనీ రోజ్ ను వేధించిన బిజినెస్ మాన్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.(Honey Rose)